కొత్త ఓటర్ల నమోదుతోపాటు పేర్లు, అడ్రస్ల మార్పులు, చేర్పునకు సంబంధించి మార్చి నుంచి జూలై 15 వరకు ఎన్నికల సంఘం అవకాశమివ్వగా, కొత్త ఓటర్లుగా 23,852 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 21,781 దరఖాస్తులకు జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆమోదం తెలిపింది. దీంతో వికారాబాద్ జిల్లాలో ఓటర్ల సంఖ్య 9,02,809కి చేరింది. ఓటరు ముసాయిదా జాబితాను ఈ నెల 21న విడుదల చేయనుండగా, ఓటరు తుది జాబితాను అక్టోబర్ 4న విడుదల చేయనున్నారు. మరోవైపు ఈ నెల 21 నుంచి సెప్టెంబర్ 19 వరకు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం చివరి అవకాశం ఇచ్చింది.
– వికారాబాద్, ఆగస్టు 1, (నమస్తే తెలంగాణ)