Plastic Ban | కొత్తూరు, మార్చి 18 : 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లు వాడితే రూ. 500 నుంచి రూ. 5 వేల వరకు జరిమానా విధిస్తామని కొత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ బాతు లావణ్య హెచ్చరించారు. మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య ఆధ్వర్యంలో కొత్తూరు పాత మున్సిపల్ చైర్పర్సన్ తడి, పొడి చెత్త, సింగల్ యూజ్ ప్లాస్టిక్ ఉపయోగంపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తడి, పొడి చెత్తను వేరుచేసి మున్సిపల్ చెత్త వాహనాలకు ఇవ్వాలని సూచించారు. చెత్తను వేరుచేసి ఇవ్వడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ 120 మైక్రాన్లు కన్నా ఎక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లను వాడాలన్నారు. ముఖ్యంగా వీధి వ్యాపారులు, దుకాణ యజమానులు ఈ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలాజీ, కౌన్సిలర్ సోమ్లా నాయక్, నాయకులు సుదర్శన్‌గౌడ్, వీరమోని దేవేందర్, మహిళా సంఘం సభ్యులు, దుకాణ యజమానులు, వీధి వ్యాపారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.