దళపతి విజయ్ విడాకుల వివాదం చల్లారకముందే.. విజయ్, త్రిష కలిసి ఓ వివాహ వేడుకకు హాజరు కావడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై ఎవరికి తోచినట్టు వాళ్లు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. టాలీవుడ్ నటుడు పార్తిబన్ ఓ ఈవెంట్లో ఈ విషయంపై ప్రస్తావిస్తూ ‘ఆమె కొన్ని రోజులు ఇంట్లోనే ఉండటం మంచిది. బయటకొస్తే ఎక్కడలేని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది’ అన్నారు. ఈ వ్యాఖ్యలపై త్రిష తన సోషల్ మీడియా ద్వారా పరోక్షంగా స్పందిస్తూ.. ‘చేతిలో మైక్ ఉంది కదా అని ఏదిపడితే అది మాట్లాడితే కామెడీ అవ్వదు.
మూర్ఖత్వం అవుతుంది..’ అంటూ కౌంటరిచ్చింది. దాంతో గతుక్కుమన్న పార్తిబన్ వెంటనే మరో పోస్ట్ పెట్టారు. ‘ఈ విషయంలో నేను మాట్లాడింది తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు నాకు పశ్చాత్తాపపడటం తప్ప మరో మార్గం లేదు’ అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. వీరిద్దరి స్టేట్మెంట్లు ప్రస్తుతం తమిళనాట వైరల్‌గా మారాయి.