పరిగి, ఫిబ్రవరి 1 : కులకచర్ల మండలంలోని దాస్యనాయక్తండాలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు పరిగి నియోజకవర్గానికి విచ్చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఘన స్వాగతం లభించింది. పూడూరు మండలంలోని సోమన్గుర్తి స్టేజీ వద్ద ఆయనకు పరిగి మాజీ ఎమ్మె ల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సోమన్గుర్తి స్టేజీ వద్ద బీఆర్ఎస్ జెండాను మాజీ మంత్రి ఆవిష్కరించా రు. అక్కడి నుంచి భారీ కాన్వాయ్‌తో ఆయన పర్యటన కొనసాగింది. పరిగి పట్టణంలోని బహార్‌పేట్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్‌కు భారీ గజమాలను క్రేన్ సహాయం తో వేసి ఘనంగా స్వాగతం పలికారు.
పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న భవనాలపై నిలబడి ప్రజలు ఆయనకు అభివాదం చేశారు. బహార్‌పేట్ చౌరస్తాలో జేసీబీలపై నుంచి పూలవర్షం కురిపించారు. దోమ మండలంలోని బొంపల్లి, బాస్పల్లి స్టేజీల వద్ద కేటీఆర్ బీఆర్ఎస్ జెండాలను ఎగురవేశారు. మోత్కూర్ స్టేజీ వద్ద శివాజీ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం కులకచర్ల మండలంలోని దాస్యనాయక్తండాలో అంబేద్కర్ విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. పరిగి నియోజకవర్గ పర్యటనలో ఆయనకు అడుగడుగునా ఘన స్వాగతం ల భించింది.
ఆయా కార్యక్రమాల్లో పరిగి మున్సిపల్ మాజీ చైర్మన్ ముకుంద అశోక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎ.సురేందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సీనియర్ నాయకులు మేడిద రాజేందర్, బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, జడ్పీ మాజీ కో-ఆప్షన్ సభ్యుడు మీర్ మహమూద్‌అలీ, కులకచర్ల, చౌడాపూర్ మండలాల బీఆర్ఎస్ నాయకులు సుధాకర్‌రెడ్డి, పీరంపల్లి రాజు, రాందాస్, మందిపల్ వెంకట్, సారా శ్రీనివా స్, గుండుమల్ల నర్సింహులు, రాములుగౌడ్, సేవాలాల్ సేన రాష్ట్ర నాయకుడు అజయ్‌నాయక్, రాజూనాయక్, దోమ మాజీ జడ్పీటీసీలు కొప్పుల నాగారెడ్డి, బోయిని లక్ష్మయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గోపాల్‌గౌడ్, సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు రాజిరె డ్డి, పూడూరు మాజీ ఎంపీపీ మల్లేశం, మాజీ జడ్పీటీసీ మేఘమాల, నాయకులు రాజేందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, వెంకటయ్య, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. కార్యక్రమానికి పోలీసులు చివరి వరకు అనుమతి ఇవ్వకుండా శుక్రవారం రాత్రి 9 గంటలకు అనుమతి ఇవ్వడంతో పార్టీ కేడర్ సైతం ఈ కార్యక్రమాన్ని మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. దారి పొడవునా భారీ ఎత్తున స్వాగతం పలకడంతోపాటు మారుమూలన న్న దాస్యనాయక్తండాలో జరిగిన కార్యక్రమంలో వేలాదిగా పాల్గొన్నారు. సభలో కేటీఆర్ ప్రసంగించిన తీరు శ్రేణుల్లో మరింత జో ష్ నింపింది. రైతుబంధు వస్తుందా..?, రూ. 2500 వస్తున్నాయా..? తులం బంగారం ఇస్తున్నారా..? వంటి అంశాలు అడిగినప్పు డు సభలోని వారందరూ రావడం లేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును కేటీఆర్ ఎండగట్టిన సందర్భంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.
అంబేద్కర్ అన్ని వర్గాల వ్యక్తి అని, ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు కల్పిం చిన మహనీయుడని సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్‌నాయక్ పేర్కొన్నారు. తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్టీలకు ఆరు శాతం రిజర్వేషన్ ఉండగా తెలంగాణలో 10 శాతం కల్పించారని.. సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించి.. రూ. కోటి కేటా యించిన ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మాజీ సీఎం అనుసరించారన్నారు. లంబాడాలను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. లగచర్లలో గిరిజనుల భూములను లాక్కొనే ప్రయత్నం చేసిందని.. కేసులు పెట్టి నెలల తరబడి జైలుపాలు చేసిందని.. సమయం వచ్చినప్పుడు తమ ప్రతాపం చూపుతామని హెచ్చరించారు. అనంతరం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్పర్సన్ రజిని మాట్లాడుతూ.. పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో చైతన్యవంతమైన జ్ఞానసభలు జరిగాయని గుర్తు చేశారు. ప్రతి తండాలోనూ అంబేద్కర్ విగ్రహాలు ఉండాలని సాయిచంద్ చెప్పారన్నారు.
అంబేద్కర్ చరిత్ర అందరికీ తెలియాలనే మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ నడిబొడ్డున అంబేద్కర్ 125 అడుగుల విగ్ర హాన్ని ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ మహమూద్‌అలీ, మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్‌రెడ్డి, శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పట్నం నరేందర్‌రెడ్డి, పైలట్ రోహిత్‌రెడ్డి, బాల్క సుమన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేందర్‌గౌడ్, సీనియర్ నాయకులు కొప్పుల అనిల్‌రెడ్డి, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాయక్, సేవాలాల్ సేన నాయకులు, బీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మళ్లీ మీరే అధికారంలోకి రావాలి..అప్పుడే అన్ని వస్తాయని మహిళా రైతులు, కూలీ లు పేర్కొన్నారు. మోత్కూర్ స్టేజీ సమీపంలో పొలంలో పనిచేస్తున్న మహిళా రైతులు, కూలీలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా రైతుభరోసా వస్తున్నదా..? ప్రతినెలా రూ.2,500 ఇస్తున్నారా..? అని మహిళలను అడుగగా ఏమి రావడం లేదని వారు చెప్పారు. ఆగమయ్యారు కదా అని పేర్కొనగా ఆగమైపోయామని, మళ్లీ మీరే అధికారంలోకి రావాలన్నారు. పనిచేసే మహేశ్‌రెడ్డిని ఓడగొట్టుకుంటిరి, మళ్లీ మీ ఆశీర్వాదంతో కేసీఆర్ సార్ వస్తారు.. అన్ని వస్తాయని కేటీఆర్ తెలిపారు.
దుద్యాల మండలంలోని లగచర్ల ఘటనలో జైలుకెళ్లి ఇటీవల బెయిల్‌పై విడుదలైన బోగమోని సురేశ్, గోపాల్‌నాయక్‌లను దాస్యనాయక్తం డాలో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శాలువాలతో సన్మానించారు. రైతుల తరఫున పోరాడి వారు జైలుకు వెళ్లారని పేర్కొన్నారు
కొడంగల్ : కులకచర్ల మండలంలోని దాస్యనాయక్తండాలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు విచ్చేసిన మాజీ మంత్రి కేటీఆర్‌కు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు పరిగి పట్టణంలోని కొడంగల్ కూడలి లో ఘన స్వాగతం పలికారు. పరిగి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి నివాసంలో మాజీ ఎమ్మె ల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నా యకులు మధుసూదన్‌రావు యాదవ్, సలీం, మహిపాల్, రామకృష్ణ, మహేందర్‌రెడ్డి, భీములు తదితరు లు కలిశారు. ఈ సందర్భంగా కొడంగల్ పట్టణంలోనూ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కోరగా.. స్పం దించిన మాజీ మంత్రి ఈ నెలాఖరులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేద్దామన్నారు.
చేవెళ్ల రూరల్ : వికారాబాద్ జిల్లా, కులకచర్ల మండలంలోని దాస్యనాయక్తండాలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు వెళ్తున్న మాజీ మంత్రి కేటీఆర్‌కు మండలంలోని చిట్టపల్లి గేట్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జై కేసీఆర్.. జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అంజన్‌గౌడ్ ఆధ్వర్యంలో కేటీఆర్‌కు పూల మొక్క అందజేసి సత్కరించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, సీనియర్ నాయకుడు విఘ్నేశ్గౌడ్, కరుణాకర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, శేఖర్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు శేఖర్, సుదర్శన్, రాజు, అబ్దుల్ ఘని, రామస్వామి, వీరాజంనేయులు, పాండు, వీరస్వామి, ఎల్లన్న, ఈశ్వరయ్య, శివారెడ్డి, రాంప్రసాద్, మాధవ్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు వెంటకయ్య, గాయత్రీగోపాలకృష్ణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.