కొడంగల్ : పేకాట స్థావరాలపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి 45మందిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ అప్పయ్య తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ మండలంలోని అంగడిరాయిచూర్, రావులపల్లి గ్రామాల్లో తెలుసుకున్న సమాచారం మేరకు దాడులు నిర్వహించమన్నారు. పేకాట ఆడుతున్న 45మంది పట్టుబడగా వీరితో పాటు రూ. 2లక్షల 85వేల నగదును స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.