బొంరాస్‌పేట, ఏప్రిల్ 20 : గ్రామాల సమగ్ర అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. గురువారం బొంరాస్‌పేట మండలం లోని నాగిరెడ్డిపల్లి నుంచి కొత్తూరు మీదుగా దేవనూరు వరకు రూ.3.10 కోట్లతో నిర్మి స్తున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన, కొత్తూరు గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను, ముస్లింల స్మశాన వాటికకు రూ.10 లక్షలతో నిర్మించిన ప్రహరీని, జానకంపల్లి గ్రామంలో సీసీ రోడ్లు, వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం, క్రీడా మైదానాలను ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం దుద్యాల మండల కేంద్రంలో ఈద్గాను ప్రారంభించి ముస్లింలకు రంజాన్ కానుకలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సమావేశాలలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి సీఎం కేసీఆర్ కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నా రన్నారు. కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుతో ప్రజలకు పాలనా సౌలభ్యం ఏర్పడిం దని, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోకుండా గిట్టుబాటు ధరలు కల్పించి గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
జానకంపల్లి గ్రామానికి బీటీ రోడ్డు మంజూరు చేస్తానని, అసంపూర్తిగా ఉన్న విద్యుత్ పనులను వెంటనే పూర్తి చేయిస్తానని, ప్రభుత్వ భూమిని సర్వే చేసి భూమిలేని పేదలకు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోట్ల యాదగిరి, బీఆర్ఎస్ దుద్యాల మండలాధ్యక్షుడు చాంద్‌పాషా, మాజీ వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, ఎంపీటీసీలు శ్రావణ్‌గౌడ్, ఎల్లప్ప, బీఆర్ఎస్ తాలుకా యూత్ అధ్యక్షుడు నరేష్‌గౌడ్, పార్టీ నాయకులు టీటీ రామునాయక్, బసిరెడ్డి, రామకృష్ణ యాదవ్, రవిగౌడ్, యూనుస్, శ్రీనివాస్‌గౌడ్, బాల్‌రెడ్డి, బాలప్ప, హీర్యానాయక్, సురేందర్‌గౌడ్ పాల్గొన్నారు.
కొడంగల్, ఏప్రిల్ 20: స్వచ్ఛతతోనే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని ఎమ్మెల్యే నరేం దర్‌రెడ్డి తెలిపారు. గురువారం మున్సిపల్ పరిధిలోని 2వ, 8వ, 11వ వార్డుల్లో సామూ హిక మరుగుదొడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటి ఆవరణలో మరుగుదొడ్డి నిర్మాణానికి స్థలం లేని వారికి ప్రభుత్వ స్థలంలో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యాలను కాపాడుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. స్వచ్ఛత, పచ్చదనం కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. ఆరుబయట మలమూత్ర విసర్జనలతో ఆరో గ్యాలు దెబ్బతింటాయనే విషయాన్ని గ్రహించి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ఇంకుడు గుంతల నిర్మానాన్ని ప్రోత్సహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఉషారాణి, మున్సిపల్ కౌన్సిలర్లు మధుసూదన్‌రావు యాదవ్, వెంకట్‌రెడ్డిలతో పాటు బీఆర్ఎస్ నాయకులు రమేశ్‌బాబు, నవాజోద్దిన్, మున్సిపల్ కమీషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డితో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు