శివకేశవులకు ప్రీతిపాత్రమైన పవిత్ర కార్తిక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పలు ఆలయాలు కిటకిటలాడాయి. వేకువ జాము నుంచే మహిళా భక్తులు కార్తిక స్నానమాచరించిన అనంతరం ఎంతో భక్తిశ్రద్ధలతో దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. సర్వపాపాలు తొలగి, ఐష్టెశ్యర్యాలు కలుగాలని తమ ఇష్ట దైవాలను వేడుకున్నారు.