షాబాద్, మార్చి 29 : రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా బుధవారం 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాల్లో 13,135 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1,099 మందికి కంటి అద్దాలు అందజేశారు. 933 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు సంబంధిత వైద్యరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
278 గ్రామాలు, 57 వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలు
బొంరాస్పేట : నేత్ర సంబంధిత వ్యాధులతో వచ్చినవారికి జిల్లాలోని 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కండ్లద్దాలతోపాటు చుక్కల మందు అందజేస్తున్నారు. జిల్లాలో 4978 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 621 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 747 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు 278 గ్రామాలు, 57 వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలను నిర్వహించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.
కంటి వెలుగుతో మేలు
– వెంకటయ్య, కమ్మెట, చేవెళ్ల మండలం
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమంతో మాలాంటి వారికి ఎంతో మేలు కలుగుతున్నది. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి చూపించుకునే స్థోమత లేదు. గ్రామాలకు వచ్చి కంటి పరీక్షలు చేసి ఉచితంగా అద్దాలు, మందులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. నాకు దూరం చూపు కొంత ఇబ్బందిగా ఉంది.