బీఆర్ఎస్తోనే గొల్ల, కురుమల సంక్షేమం..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గొల్ల, కురుమల మనుగడ అంధకారమేనని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్యాదవ్ అన్నారు.
- గొల్లకురుమలు మాటిస్తే తప్పరు.. కారు గుర్తుకు ఓటేస్తారు..
- గొర్రెల పంపిణీతో రాష్ట్ర సర్కార్ చేయూతనందించింది
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గొల్లకురుమల మనుగడ అంధకారమే..
- కల్వకుర్తి నియోజకవర్గ ప్రజా సేవకే నా జీవితం అంకితం
- కల్వకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్
- ఆమనగల్లు పట్టణంలో కల్వకుర్తి నియోజకవర్గ గొర్లకాపర్ల ఆత్మీయ సమ్మేళనం
ఆమనగల్లు, నవంబర్ 7: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గొల్ల, కురుమల మనుగడ అంధకారమేనని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్యాదవ్ అన్నారు. మంగళవారం ఆమనగల్లు పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన నియోజకవర్గ గొర్రెల కాపరుల ఆత్మీయ సమ్మేళనానికి బీఆర్ఎస్ కల్వకుర్తి అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎమ్మె ల్సీ, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం, గొల్ల, కురుమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలరాజ్యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చే ది లేదని వాటిని బంగాళాఖాతంలో కలపాలన్నారు. గుజరాతీ, ఢిల్లీ గులామ్‌లను తరిమికొట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టోలోని ప్రతి అంశాన్నీ సీఎం కేసీఆర్ అమలు చేస్తారని స్పష్టం చేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలో 10,444 యూనిట్లకు మొదటి విడుతగా 5027 యూ నిట్లను గొల్ల,కురుమల కుటుంబాలకు రూ.64కోట్ల 31 లక్షలు ఖర్చు చేసి అందించినట్లు వివరించారు.
మిగిలిన యూనిట్లను అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ అమలు చేస్తారన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం గొల్ల, కురుమల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నదన్నారు. సర్వేలన్నీ బీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయని మారోసారి జైపాల్‌యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. అనంతరం ఎగ్గె మల్లేశం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో పాలమూరు-రంగారెడ్డి ప్రా జెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తైతే కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికీ నీరు అందుతుందన్నారు. కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డిలకు రాజకీ య విలువలుంటే వెంటనే తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా లు చేయాలని డిమాండ్ చేశారు. కల్వకుర్తిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలవడం సాధ్యంకాదని ముం దుగానే పసిగట్టిన వంశీచంద్‌రెడ్డి తన సీటును కసిరెడ్డికి ఇచ్చాడని ఎద్దేవా చేశాడు. సుదీర్ఘ రాజకీ య అనుభవం ఉన్న జైపాల్‌యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు.
అనంతరం ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గొల్ల, కురుమల కుటుంబాలకు అండగా ఉన్నారన్నారు. బీఆర్ ఎస్‌తోనే గొల్ల, కురుమల సంక్షే మం సాధ్యమన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అన్ని పథకాలను నిలిపేసినా సీఎం కేసీఆర్ మాత్రం గొల్ల, కురుమలపై ఉన్న ప్రేమతో గొర్రెలను పంపిణీ చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డిని అడుగడుగునా అడ్డుకోవాలని కార్యకర్తలు, ప్రజలకు సూచించారు. కాగా మడ్గుల మండలంలోని పెద్ద మడ్గుల-నర్సాయిపల్లి మధ్యలో 2003 నవంబర్7న నాపై నక్సల్స్ కాల్పు లు జరపగా నియోజకవర్గ ప్రజల దీవెనతో బతికినట్లు ఆయన చెప్పారు. మీ బిడ్డగా ఆశీర్వదించి.. మరోసారి అవకాశమిస్తే నా జీవితాన్ని నియోజకవర్గ ప్రజలకు అంకితం ఇస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్, ఏఎంసీ వైస్ చైర్మన్ గిరియాదవ్, రై,స,స అధ్యక్షుడు నిట్ట నారాయణ, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులుయాదవ్, రాములుయాదవ్, మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఖలీల్, యాదవ సంఘం నాయకుడు కృష్ణయాదవ్, కడ్తాల్ ఉప సర్పంచ్ రామకృష్ణ, పెద్దయ్యయాదవ్, నరేశ్‌యాదవ్, వరుణ్, రాజేందర్‌యాదవ్, శ్రీను, శ్రీనుయాదవ్, సురేశ్‌యాదవ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కును వినియోగించుకోవాలి
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేందుకు బుధవారం సాయం త్రం 5:00 గంటల వరకు సంబంధిత రిటర్నింగ్ అధికారులకు ఫారం-12 డీ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వికారాబాద్ జిల్లా ఎన్నికల అధికారి నారాయణరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 80 ఏండ్లు నిండిన వయోవృద్ధులు, 40 శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్న దివ్యాంగులు అలాగే అత్యవసర సేవలు అందించే వైద్యారోగ్య, విద్యుత్తు, సమాచార, పౌర సంబంధాలు, రైల్వే, పోస్టల్ శాఖల అధికారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
సీ- విజిల్ యాప్‌ను వినియోగించాలి
ఇబ్రహీంపట్నం, నవంబర్ 7 : శాసనసభ ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు ప్రజలు సీ-విజిల్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ భారతి హోలీకేరీ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ఓటర్లను ప్రలోభపెట్టినా..భయపెట్టినా.. బలవంతంగా ప్రభావితం చేసిన సీ-విజిల్ యాప్ ద్వారా ఎవరైనా సమాచారం ఇవ్వొచ్చన్నారు. ఫిర్యాదు అందించిన 100 నిమిషాల్లోనే సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు. సీ-విజిల్ యాప్ ప్రజలకు బ్రహ్మాస్త్రం లాందన్నారు. ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ సీ -విజిల్ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. సమస్యను కెమెరా ఆన్‌చేసి ఫొటో లేదా వీడియో తీసి సమస్యను సంక్లిప్తంగా టైప్చేయి పంపించాలన్నారు. ఫిర్యాదుదారుల పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. అంతేకాకుండా రంగారెడ్డి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూం నంబర్ 040-23238545కు ఫిర్యాదు చేయొచ్చన్నారు.
నాలుగోరోజు 29 నామినేషన్లు
ఇబ్రహీంపట్నం, నవంబర్ 7: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నాలుగోరోజు రంగారెడ్డి జిల్లాలో మంగళవారం 29 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలుచేశారు. వీరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు పలువురు ఇండిపెండెంట్లు ఉన్నారు. మంగళవారం నామినేషన్లు దాఖలు చేసినవారిలో షాద్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్యయాదవ్ కూడా ఉన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

