కడ్తాల్ : మండల పరిధిలోని మైసిగండి మైసమ్మతల్లి ఆలయ హుండీ లెక్కించారు. గురువారం దేవాదాయశాఖ జిల్లా ఇన్స్పెక్టర్ ప్రణీత్‌కుమార్ సమక్షంలో అమ్మవారి హుండీ లెక్కింపును నిర్వహించారు. 30రోజులకు సంబంధించిన హుండీ ఆదాయన్ని లెక్కించగా, రూ. 5,61,615ల ఆదాయం వచ్చిన్నట్లు ఆలయ ఈవో స్నేహలత, ట్రస్ట్ చైర్మన్ శిరోలీపంతూనాయక్ తెలిపారు. వచ్చిన మొత్తాన్ని కడ్తాల్ మండల కేంద్రంలోని కెనరాబ్యాంక్‌లో జమ చేస్తున్నట్లు వారు తెలిపారు.
కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ ట్రస్టీ రమావత్ శిరోలీ, ఆలయ నిర్వాహకులు ఆర్పీ భాస్కర్‌నాయక్, అరుణ్‌కుమార్, ఆలయ సిబ్బంది యాదగిరిస్వామి, బోడియ నాయక్ పాల్గొన్నారు.