కందుకూరు, సెప్టెంబర్ 1 : ప్రజలు ప్రతిపక్షాలను నమ్మరని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రా ష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు భారీగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతుండడంతో జాతీయ పార్టీలు బేజారు అవుతున్నాయని చెప్పారు. యువజన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఢిల్లీ శ్రీధర్ ముదిరాజ్తో బాచుపల్లి, లేమూరు, దెబ్బడగూడ గ్రామాలకు చెందిన 150 మంది కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు ఆ పార్టీలకు రాజీనామాలు చేసి బీఆర్ఎస్లో మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆమె సమక్షంలో చేరారు.
వారికి మంత్రి బీఆర్ఎస్ కండువాల ను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ రెండో స్థానం కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయని వివరించారు. పార్టీలు ముఖ్యం కాదని, అభివృద్ధి ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి పక్షాలను నమ్మి మోసపోవద్దని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జంగారెడ్డి. మార్కెట్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మ న్ చంద్రశేఖర్, పార్టీ మండల అధ్యక్షుడు జయేందర్ ము దిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మేఘనాధ్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, లేమూరు సర్పంచ్ పరంజ్యోతి, భూపాల్‌రెడ్డి. రాంచంద్రారెడ్డి, దశరథ్ ముదిరాజ్, ప్రభాకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు కొండల్‌రెడ్డి, ఢిల్లీ గణేశ్ ముదిరాజ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్‌రెడ్డి, ఉప సర్పంచ్ కొండల్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, దేవేందర్, సుధాకర్, యాదగిరి, యూత్ నాయకులు కార్తీక్, విఘ్నేశ్వర్‌రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ దీక్షిత్‌రెడ్డి, కాకి రవి ముదిరాజ్, ఎంపీటీసీ కాకి రాములు, సదానంద్‌గౌడ్, నవీన్ కుమార్, డైరెక్టర్లు ఆనంద్, పాండు, దేవీలాల్ నాయక్, గోపిరెడ్డి సత్యనారాయణరెడ్డి, జైపాల్, సురేందర్‌రెడ్డి, సిద్ధూగౌడ్, కుమార్, దావుద్ పాల్గొన్నారు.