సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరారు. కందుకూరు మండలంలోని కొత్తూరు, గఫూర్నగర్ గ్రామాలకు చెందిన దాదాపు 50 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయ కులు, కార్యకర్తలు మంత్రి సబితారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అదేవిధంగా షాద్‌నగర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సమక్షంలో నాయీబ్రాహ్మణులు చేరగా…చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య సమక్షంలో చేవెళ్ల మండలం లోని ధర్మసాగర్, గొల్లపల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు చేరారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ సమక్షంలో కడ్తాల్ మండల కేంద్రానికి చెందిన ప్రవీణ్, మల్లేశ్‌తోపాటు మరో 10 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు .. వికారాబాద్ మండలంలోని గోధుమగూడ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీలకు చెందిన దాదాపు 70 మంది వికారా బాద్ ఎమ్మెల్యే ఆనంద్ సమక్షంలో గులాబీ గూటిలోకి వచ్చారు. కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సమక్షంలో మద్దూరు మండలంలోని దుప్పటిగట్టు గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.
కందుకూరు, సెప్టెంబర్ 26 : ప్రతిపక్ష పార్టీ నాయకుల మాటలు నమ్మి మోసపోద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రజలకు సూచించారు. మండలంలోని కొత్తూరు, గఫూర్నగర్ గ్రామాలకు చెందిన 50మంది కాం గ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంగళవారం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందన్నా రు. ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన వారు బీఆర్ఎస్లో చేరుతున్నార న్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు అధికార దాహంతో అమలు కాని హామీలు ఇస్తున్నారని ఆరోపించారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా రాను న్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించి.. కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయం గా ముందుకు సాగుతున్న పార్టీని ఆదరించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో రంగారెడ్డి జడ్పీచైర్ పర్సన్ తీగల అనితాహరినాథ్‌రెడ్డి, జడ్పీటీసీ జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మ న్ సురేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, సీనియర్ నాయకులు లక్ష్మీనర్సింహరెడ్డి, దశరథ్, మేఘనాథ్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, శ్రీధర్, ఆనంద్, యూత్ నాయకులు విఘ్నేశ్వర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, దీక్షిత్‌రెడ్డి, యాదయ్య, రాజు, శ్రీనివాస్, రా జు, విఠల్, రవీందర్, జయమ్మ, కుమార్, చెన్నయ్య, శ్రీకాంత్, మల్లేశ్, నరేశ్,రాజేందర్, దేవేందర్ పాల్గొన్నారు.
కొత్తూరు, సెప్టెంబర్ 26 : రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, పార్టీలో చేరుతున్న వారిని చేస్తే ఇదే అర్థమవుతున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండలం లోని కొడిచెర్లకు చెందిన నాయీబ్రాహ్మణులు షాద్‌నగర్‌లోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోజురోజుకూ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతుందన్నా రు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులవుతున్నారన్నారు. నాయీబ్రాహ్మణులు సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని.. ఇప్పటికే వారికి పనిముట్లతోపాటు సెలూన్లకు ఉచితంగా విద్యుత్తును సరఫరా చేస్తున్నారని కొనియాడారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో జగదీశ్, వెంకటయ్య, నర్సింహ, శ్రీనాథ్, శివకుమార్, అనిల్‌తోపాటు మరో 20 మంది చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయాదవ్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సత్యనారాయణ, కొడిచెర్ల బీఆర్ఎస్ అధ్యక్షుడు జంగయ్యయాదవ్, నరసింహాగౌడ్, చెన్నయ్య, రాజు, వినయ్, మాణిక్యరెడ్డి పాల్గొన్నారు.
కడ్తాల్, సెప్టెంబర్ 26: రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రానికి చెం దిన ప్రవీణ్, మల్లేశ్‌తోపాటు మరో 10 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ సీఎం కేసీఆర్ పాలనలో ఇంటింటికీ ప్రభు త్వ పథకాలు అందుతున్నాయని.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో లబ్ధి పొందుతూ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీలపై నమ్మకం లేకపోవడంతో ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ పాలన కులమతాలకతీతంగా సబ్బండ వర్ణాలకు అనుగుణంగా సాగుతున్నదని కొనియాడారు.
పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం ఇస్తామని.. అందరూ కలిసి పార్టీని మరింత బలోపేతం చేసి.. మూడోసారి కూడా కేసీఆర్ సీఎంగా చేసేంత వరకు కష్టపడాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, ఏఎంసీ డైరెక్టర్ లాయక్‌అలీ, రైతుబంధు సమితి గ్రామాధ్యక్షుడు నర్సింహ, నాయకులు భిక్షపతి, రామచంద్రయ్య, ముత్తి కృష్ణ, యాదయ్య, శ్రీరాములు, పాండు, సురేశ్, బాబు తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్, సెప్టెంబర్ 26: మోసపూరిత ప్రతిపక్షాలను నమ్మొద్దని.. అభివృద్ధి చేస్తున్న పార్టీని ఆదరించాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నా రు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో మద్దూర్ మండలంలోని దుప్పటిగ ట్టు గ్రామానికి చెందిన 50మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన బీఆర్ఎస్ను రానున్న ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో గెలిపించేందుకు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుతున్నారన్నారు. కొడంగల్‌లో వార్ వన్‌సైడేనని.. ఎదురులేని శక్తిగా పార్టీ ఎదుగుతున్నదన్నారు. సీఎం కేసీఆర్ సుస్థిర పాలనను చూసి ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్య కర్తలు మూకుమ్మడిగా బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ ప్రభు త్వం చేతల సర్కారు అని కొనియాడారు. తొమ్మిదేండ్లలో 60 ఏండ్లలో జరుగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ చేసి చూపి దేశానికే రాష్ర్టాన్ని ఆదర్శంగా నిలిపారన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయం గా ప్రభుత్వం వివిధ రకాల పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదన్నారు. దీంతో పొరుగు రాష్ట్రమైన కర్ణాటక ప్రజలు తెలంగాణ వైపు చూస్తున్నారని, తెలంగాణలో మా గ్రామాలను కలిపితే జీవితాలు బాగుపడతాయని కోరుకుంటున్నారన్నా రు. ఎన్నికల జాతర ప్రారంభం కావడంతో ప్రతిపక్ష పార్టీలు అమలుకు సాధ్యం కాని హామీలు ఇస్తున్నాయని.. వాటిని ప్రజలు నమ్మి మోసపోవద్దన్నారు. అసాధ్యం అన్న మిషన్ భగీరథ, 24 గంటల విద్యుత్తు వంటి ఎన్నో పథకాలను సు సాధ్యం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చారన్నారు. నాలుగేండ్లలో కొడంగల్ నియోజకవర్గా న్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు.
బీఆర్ఎస్లోకి.. బీజేపీ సీనియర్ నాయకుడు
బీజేపీలో 30 ఏండ్లుగా పనిచేసిన ఆ పార్టీ జిల్లా యువమోర్చా అధ్యక్షుడు చందప్ప ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని గుర్తించి పార్టీలో చేరినట్లు ఆయ న వివరించారు. పార్టీలో చేరుతున్న నాయకులు, కార్యకర్తలకు అండగా నిలుస్తానని, కలిసికట్టుగా పార్టీని మరింత బలోపేతం చేద్దామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్‌రావు యాదవ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రమేశ్‌బాబు, బీఆర్ఎస్ యూత్ నాయకుడు అరుణ్‌కుమార్, బీఆర్ఎస్ పార్టీ బొంరాస్‌పేట అధ్యక్షుడు యాదగిరి, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, మహిళా నాయకురాలు అన్నుబాయి, దత్తురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్, సెప్టెంబర్ 26 : బీఆర్ఎస్ పార్టీతోనే ప్రజారంజక పాలన సాధ్యమని వికారా బాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. మంగళవారం వికారాబాద్ ఎమ్మెల్యే నివాసంలో మండలంలోని గోధుమగూడ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీలకు చెందిన దాదాపు 70 మంది బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పారు. అనం తరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో ప్రజలందరూ సం తోషంగా ఉన్నారన్నారు. ఇంటింటికీ సంక్షేమ పథకాలను ఆదుకుంటున్నారన్నారు. 60 ఏండ్లలో జరుగని అభివృద్ధిని కేవలం తొమ్మిదేండ్ల కాలంలో చూపించారని కొనియాడారు. ప్రభుత్వం ప్రతి ఏటా కేటాయిస్తున్న నిధులతో గ్రామాలు పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్నా యన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీ య, మిషన్ భగీరథ, ఆసరాపింఛన్లు తదితర పథకాల అమలుతో సంక్షేమ పథకాల అమలు తో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మా టలు నమ్మి మోసపోవద్దని.. అసత్య ప్రచారాన్ని నమొద్దని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ, నర్సింహులు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్, సెప్టెంబర్ 26: రాష్ట్రంలో అమలవుతు న్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చేవెళ్ల ఎమ్మెల్మే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం మండలంలోని ధర్మసాగర్, గొల్లపల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేశారు. వారికి ఎమ్మెల్యే యాదయ్య గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. మన దగ్గర కొనసాగుతున్న పథకాలు ఇతర ఏ రాష్ర్టాల్లోనూ లేవన్నారు. సీఎం కేసీఆర్ తీసుకు న్న చర్యలతో తొమ్మిదేండ్ల కాలంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందున్నదని కొనియాడారు. రాష్ర్టాభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని.. అందువల్ల రానున్న ఎన్నికల్లోనూ సీఎం కేసీఆర్‌ను మూడోసారి కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఆయన సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, నాయకు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.