పరిగి, అక్టోబర్ 10 : పరిగి మండలం దామగుండంలో ఏర్పాటు చేయనున్న నేవీ రాడార్ ప్రాజెక్టు శంకుస్థాపన ఈ నెల 15వ తేదీన నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు గురువారం పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్ రాజ్‌బీర్‌సింగ్, నేవీ అధికారులు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానపత్రిక అందజేశారు. రాష్ట్ర మంత్రి కొండా సురేఖను సైతం కలిసి శంకుస్థాపనకు ఆహ్వానించారు.