ఇందిరమ్మ ఇండ్ల కోసం హౌస్ ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోవడంతో తమకు ఇండ్లు వచ్చేనా ..? అని నిరుపేదలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను వేసి అర్హులను గుర్తించేందుకు ఇండ్ల సర్వేను చేపట్టింది. ఒకవైపు ఇండ్ల సర్వే జరుగుతుండగానే మరోవైపు చోటామోటా నాయకులు ఇండ్ల కోసం పైరవీలను మొదలెట్టారు. కాగా జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 3,75,013 దరఖాస్తులు రాగా.. ఇప్పటివరకు 3,60,000(96%) ఇండ్ల సర్వే పూర్తైంది. కాగా రేవంత్ సర్కారు నియోజకవర్గానికి 3500 ఇండ్లు కేటాయించడంతో తమకు ఇండ్లు వస్తాయో.. రావోనని నిరుపేద లు కలవరపడుతున్నారు.
-షాబాద్, జనవరి 9
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నిరుపేదలకు ఇండ్లు దక్కుతాయా..? అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు వేసి అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం ఇండ్ల సర్వే చేపట్టింది. కానీ నిరుపేదలు ఎక్కడ ఉన్నారో కానీ సొంతిళ్లు ఉన్నవా రు, రాజకీయ నాయకులు ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న విషయం సర్వేలో వెలుగు చూస్తుండడం విశేషం. ఒకవైపు ఇందిరమ్మ ఇండ్ల సర్వే జరుగుతుండగానే మరోవైపు చోటామోటా నాయకులు ఇండ్ల కోసం పైరవీలను మొదలెట్టారు. అధికారులు ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా అప్లికేషన్దారుల వివరాలను సేకరించి ఆన్లైన్లో నమో దు చేస్తున్నారు. అయితే ఒక్కో ఇంటికి 15 నుంచి 20 నిమిషాల సమ యం పడుతున్నది. దరఖాస్తుదారుడి పేరు, ఆధార్ ఐడీ, ఏడాది ఆదాయం, సొంత స్థలం ఉందా..? గతంలో ఇల్ల్లు మం జూరైందా..? ఇలా పలు ప్రశ్నలను సేకరించి యాప్లో నమోదు చేస్తున్నారు. యాప్లో ఏఐ టెక్నాలజీ ఉపయోగించి దరఖాస్తుదారుడి ముఖాన్ని, ఇల్లు నిర్మించుకునే వివరాలను నమోదు చేస్తున్నారు. కాగా జిల్లాలో ఇప్పటివరకు 96శాతం సర్వే పూర్తైనట్లు అధికారులు చెబుతున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తీసుకొచ్చింది. ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించగా జిల్లాలోని చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, షాద్నగర్, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజవర్గాల పరిధిలోని 21 మండలాలు, 16 మున్సిపాలిటీల్లో ఇండ్లు లేని దరఖాస్తుదా రుల నుంచి మొత్తం 3,75,013 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం సర్వేను చేపట్టగా ఇప్పటివరకు 96(3,60,000) శాతం పూర్తైంది. మిగతా నాలుగు శాతంలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, కొంతమంది చనిపోయిన వారి పేర్లు కూడా ఉండడంతో అలాంటి వారి వివరాలనూ సిబ్బంది సేకరిస్తున్నారు.
జిల్లాలో 96 శాతం ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తైంది. ప్రజాపాలనలో 21 మండలాలు, 16 మున్సిపాలిటీల నుంచి 3,75,013 ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు రాగా ఇప్పటివరకు 3,60,000 ఇండ్ల సర్వే పూర్తైంది. మిగతా నాలుగు శాతంలో కొంతమంది అందుబాటులో లేకపోవడం, మరికొంతమంది చనిపోయిన వాళ్ల పేర్లు ఉన్నాయి. వారి వివరాలను కూడా త్వరగా సేకరిస్తాం.
-చాప్లానాయక్, గృహనిర్మాణశాఖ పీడీ, రంగారెడ్డిజిల్లా