వికారాబాద్, డిసెంబర్ 19 : విద్యాశాఖలో పని చేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మా ట ప్రకారం.. వెంటనే రెగ్యులరైజ్ చేయాలని వికారాబాద్ జిల్లా సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గాంగ్యానాయక్ డిమాం డ్ చేశారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉద్యోగులు చేపట్టిన సమ్మె గురువారానికి 14వ రోజుకు చేరుకున్నది. ఇందులో భాగంగా ఉద్యోగులు వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. సమ్మెలో వికారాబాద్ జిల్లాలోని 488 మం ది సమగ్ర శిక్షా ఉద్యోగులు పాల్గొన్నారు. తమను వెంటనే క్రమబద్ధీకరించి, పేస్కేల్ అమలు చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో మహిళా నాయకురాలు ప్రభావతి, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, డీపీవో శేఖర్, పీటీఐ రవికుమార్, ఆయా మండలాల కేజీబీవీ పాఠశాలల ఎస్వోలు, సమగ్రశిక్షా అన్ని విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు.