‘బీఆర్ఎస్ పార్టీలోకి నిత్యం చేరికల జోరు కొనసాగుతున్నది.. ఏ పల్లెకెళ్లినా గులాబీ పార్టీకే జనం జైకొడుతున్నారు..’ అని మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం కొడంగల్ పట్టణంలో మద్దూర్ మండలం చెన్నారెడ్డిపల్లి, మల్రెడ్డిపల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్ శ్రేణులు మంత్రి, ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి సమక్షంలో భారీగా చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్కు లభిస్తున్న ప్రజల సంపూర్ణ మద్దతును జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను కొనుగోలు చేయాలని యత్నిస్తున్నారని ఆరోపించారు. అమ్ముడుపోయే వాళ్లు ఆలోచించాలని, ఎవరితో అభివృద్ధి సాధ్యమో ఆలోచించాల్సిన అవసరం ఉన్నదన్నారు.
– కొడంగల్, అక్టోబర్ 30
కొడంగల్ : బీఆర్ఎస్లో రోజువారీ జోరు చేరికలతో కాంగ్రెస్‌కు హడలెత్తుతున్నదని, కాంగ్రెస్‌లో చేరేవారు లేకపోవడంతో కొనుగోలు వ్యాపారం చేస్తున్నట్లు మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలో మద్దూర్ మండల పరిధిలోని చెన్నారెడ్డిపల్లి, మల్రెడ్డిపల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి, ఎమ్మెల్యే సమక్షంలో భారీగా చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు మేము సైతం బీఆర్ఎస్ వెంట అంటూ.. స్వచ్ఛందంగా చేరుతుంటే, కాంగ్రెస్‌లో చేరేవారు లేకపోవడంతో కాసులతో ప్రలోభాలకు గురిచేసి బలవంతంగా పార్టీలో చేర్చుకుంటున్నట్లు ఆరోపించారు.
కాంగ్రెస్‌లో చేరుతున్న నాయకులు, కార్యకర్తలు ఏ ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా చేరడం లేదన్నారు. అదే బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అభివృద్ధిని కోరుకునేవారు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని, కాంగ్రెస్‌లో చేరేవారు ప్రలోభాలకు లోనయ్యేవారుగా పేర్కొన్నారు. కాంగ్రెస్ వస్తే అప్పటి చీకటి రోజులు తప్పవని, అధికారంలోకి రాకముందే సాగుకు 3 గంటల కరెంటే సరిపోతుందని ఆంక్షలు పెడుతూ వ్యవసాయాన్ని భ్రష్టుపట్టించేందుకు కాంగ్రెస్ నాయకులు పూనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
కర్ణాటక రైతుల గోడును ఓసారి గుర్తించాలని, అక్కడ కాంగ్రెస్ 3 గంటల కరెంటు మాత్రమే సరఫరా చేస్తున్నదన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీనీ పూర్తి చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీనీ 100 శాతం నెరవేర్చడంతో పాటు ఆలోచనలకు కూడా తట్టని ఎన్నో అద్భుత పథకాలను అందించి ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్నదన్నారు.
ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రోజువారీగా పెద్దఎత్తున ప్రతిపక్ష నాయకులు రోజువారీగా ఎంత పెద్ద స్థాయిలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటే బీఆర్ఎస్పై ప్రజలకు ఎంతటి నమ్మకం ఏర్పడిందో గుర్తించాలన్నారు. గతంలో కొడంగల్ ఎటువంటి స్థాయిలో ఉండేది, బీఆర్ఎస్ పార్టీ హయాంలోని 5 సంవత్సరాల పాలనలో కొడంగల్ ఎంత అభివృద్ధిని సాధించిందో కంటి ముందు కనిపిస్తున్నదన్నారు. ప్రజా సంక్షేమానికి, నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న బీఆర్ఎస్ పార్టీని వదులుకోవడం అంటే ఇంటి బంధాన్ని తెంచుకోవడంతో సమానంగా పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీలో ప్రతిపక్షాలే కాకుండా గ్రామ, గ్రామాలు బీఆర్ఎస్కే మా మద్దతు అంటూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు కాసులు చూస్తుండవచ్చు కానీ ఐదేండ్లలో కన్నీళ్ల పర్యంతం తప్పదని హెచ్చరించారు. నాయకులు వెళ్లినంత మాత్రాన ప్రజలు వస్తారనేది కాంగ్రెస్ పోయిన ప్రతి ఒక్కరూ మళ్లీ బీఆర్ఎస్ సొంత గూటికి చేరుకోవాల్సిందేనని పేర్కొన్నారు. వారి ముందు దాసోహంగా ఉండాల్సిందేనని ఎమ్మెల్యే హెచ్చరించారు.
మద్దూర్ మండలంలోని చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్, చిన్న కనకప్ప, బందెప్ప, ఆనంతప్ప, నర్సప్ప, కుమ్మరి నర్సింహులు, భీములు, భీమేశ్, వెంకటేశ్, పరశురాం, జీవన్, మాణిక్యప్ప, రాములు, కాశప్ప, నారాయణ, చెన్నప్ప, అంజప్ప, అశోక్., నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆశంగారి బాల్‌రాజు, వడ్డె గండెప్ప, హసన్మియా, మైనొద్దీన్, ఎర్ర చిన్న నర్సప్ప, ప్రకాశ్‌గౌడ్, దాసరి కృష్ణమూర్తి, ఈడిగి శివ, భానుప్రకాశ్, మనోజ్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, శివకుమార్, డ్రైవర్ లాలు, రంగప్ప, గుడిసె లాలు, బాలప్పగౌడ్, భగవంతయ్యగౌడ్ తదితరులు 300ల మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.
అభివృద్ధిని చూసి..
కోస్గి : కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి కోస్గి మున్సిపల్ పరిధిలోని 12వ వార్డుకు చెందిన మాజీ వార్డు మెంబర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోనేరు సాయప్ప, తోగాపూర్ ఆనంతయ్య, నర్సింహులు హైదరాబాద్‌లో ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం కోస్గిలో కోనేరు సాయిలు పార్టీలో చేరిన సందర్భంగా మున్సిపల్ అధ్యక్షుడు రాజేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వరప్రసాద్‌ను సన్మానించి పార్టీలోకి ఆహ్వానించారు.
తుర్కయాంజాల్ : బీఆర్ఎస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి కుటుంబాలతో కలిసి ప్రజలు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి బ్రాహ్మణపల్లిలో సుమారు 40 కుటుంబాలు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ సత్తయ్య, రైతు బంధు సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, కౌన్సిలర్ మల్లేశ్, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, సంపతీశ్వర్రెడ్డి పాల్గొన్నారు.
యాచారం : మండలంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పర్వం జోరుగా కొనసాగుతున్నది. సోమవారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సమక్షంలో కుర్మిద్ద గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరగా, గున్గల్ గ్రామానికి చెందిన పలు పార్టీల నాయకులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ప్రశాంత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధికి, నూతన మ్యానిఫెస్టోకు ఆకర్షితులై పలు పార్టీల నుంచి పెద్దఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. మండలంలో పార్టీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పట్నాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, కుర్మిద్ద ఎంపీటీసీ రవికిరణ్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలున్నారు.
మర్పల్లి : బీఆర్ఎస్తోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆన్నారు. మండల పరిధిలోని కోట్‌మర్పల్లి, దామస్తాపూర్, పిల్లిగుండ్ల గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు 50 మంది బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మధుకర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాచయ్య, మాజీ సర్పంచ్ యాదవరెడ్డి, సర్పంచ్ పాండు, ఎంపీటీసీ మల్లేశం నాయకులున్నారు.
షాద్‌నగర్‌రూరల్ : రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లోకి వివిధ పార్టీల నాయకులు స్వచ్ఛందంగా చేరుతుండడం సంతోషకరమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్‌నగర్ మండలం హాజీపల్లి, కిషన్‌నగర్, పలు గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
‘3 గంటల కరెంటు మాకొద్దు దొర’ అంటూ జిల్లెడ్ చౌదరిగూడెం మండలం గుర్రంపల్లి గ్రామానికి చెందిన 75 మంది కాంగ్రెస్ నాయకులు సోమవారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందన్నారు.
పరిగి : అవినీతి లేకుండా, పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వానికే సంక్షేమ పథకాల పేటెంట్ దక్కుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా నేరుగా లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు చేరేలా అమలు చేశారన్నారు. సోమవారం పరిగిలో జడ్పీటీసీ కొప్పుల నాగారెడ్డి, సర్పంచ్ గోవర్ధన్‌గౌడ్, ఉపసర్పంచ్ తుల్జానాయక్, మాజీ సర్పంచ్ రాంచంద్రయ్య ఆధ్వర్యంలో దోమ మండలం బుద్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని మంచినీళ్ల బావితండాకు చెందిన 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.