మట్టిని తవ్వుతూ.. ఇతర ప్రాంతాలకు తరలిస్తూ
అక్రమ మట్టి దందాకు అధికార పార్టీ నేతలు తెరలేపారు. పూడిక పేరుతో ఇష్టానుసారంగా షాద్నగర్ సమీపంలోని బొబ్బిలి చెరువులో మట్టిని తవ్వుతూ.. తరలిస్తూ కాసులను ఆర్జిస్తున్నా రు. ఇంతా జరుగుతున్నా సంబంధితశాఖ అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు మండిపడుతున్నా రు.
- బొబ్బిలి చెరువు నుంచి మట్టిని మాయం చేస్తున్న కొందరు అధికార పార్టీ నేతలు
- అయినా పట్టించుకోని అధికారులు.. మండిపడుతున్న స్థానికులు
షాద్నగర్, మే 22 : అక్రమ మట్టి దందాకు అధికార పార్టీ నేతలు తెరలేపారు. పూడిక పేరుతో ఇష్టానుసారంగా షాద్నగర్ సమీపంలోని బొబ్బిలి చెరువులో మట్టిని తవ్వుతూ.. తరలిస్తూ కాసులను ఆర్జిస్తున్నా రు. ఇంతా జరుగుతున్నా సంబంధితశాఖ అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు మండిపడుతున్నా రు. షాద్నగర్ మున్సిపాలిటీ ఫరూఖ్నగర్కు చెందిన జి.సత్తయ్య ఫరూఖ్నగర్ మండలంలోని బూర్గుల గ్రామంలోని వ్యవసాయ భూమికి బొబ్బిలి, జానమ్మ చెరువుల్లో ఉన్న ఒండ్రు మట్టిని తరలించేందుకు ఇరిగేషన్ శాఖ అధికారుల నుంచి అనుమతి తీసుకున్నారు.
ఇదే అదునుగా భావించిన అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు బొబ్బిలిచెరువులో ఉన్న ఒండ్రు మట్టి ని జేసీబీలతో ఇష్టానుసారంగా తవ్వుతూ టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ డబ్బును ఆర్జిస్తున్నారు. 50 మీటర్ల వెడల్పు, 40 మీటర్ల పొడవు 0.9 మీటర్ల లోతు కొలతలతో మట్టిని తవ్వుకోవాలని అనుమతులివ్వగా ఇష్టానుసారంగా తవ్వకాలు చేపట్టి కొత్తూరు, మహేశ్వరం మండలాల పరిధిలోని పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఈ విషయమై పలువురు రెవెన్యూశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా సంబంధిత శాఖ అధికారులు ఘటన స్థలాన్ని సందర్శించి తగిన వివరాలు సేకరించారు. పట్టపగలు షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో మట్టిదందా కొనసాగుతున్నా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో సారం పెంచేందుకు వినియోగించే ఒండ్రుమట్టిని ఇటుక బట్టీల తయారీకి వినియోగించడం దురదృష్టకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

