తుర్కయాంజాల్, జూన్ 14 : తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు అక్రమ నిర్మాణాలు, అక్రమ రిసార్టులకు మున్సిపల్ అధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం సిబ్బంది నోటీసులను జారీ చేశారు.
మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధ్దంగా నిర్మించిన నిర్మాణాలను గుర్తించి.. వాటికి నోటీసులు జారీ చేశామని మున్సిపల్ సిబ్బంది తెలిపారు. నోటిసులకు సదరు నిర్మాణదారులు స్పందించకపోతే తదుపరి చర్యలు తప్పవన్నారు.