కేశంపేట, మార్చి 25: రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని లేమామిడి గ్రామానికి చెందిన టి.బాలోజీ నివాసంలో మంగళవారం సాయంత్రం మైనార్టీలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. దివంగత టి. నారంజీ జ్ఞాపకార్ధం ఆయన కుమారులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో గ్రామ మైనార్టీ సోదరులు పాల్గొన్నారు. అంతకు ముందు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఉపవాస దీక్షలను విరమించారు.
కఠినమైన ఉపవాస దీక్షలను చేపట్టిన మైనార్టీలకు ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనందంగా ఉందని బాలోజీ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిషన్, జహంగీర్, అల్లాజీ, శివాజీ, హరిశంకర్, ఆంజనేయులు, ఇబ్రహీం, బుజ్జామోల్సాబ్, ఫారూఖ్, బాసిత్, తాహేర్, సుభాని, ఇంతియాజ్, మతీన్, పాషా, ఖాదర్, మైనోద్దీన్, ఫయాజ్, తదితరులు పాల్గొన్నారు.