షాద్‌నగర్‌టౌన్, అక్టోబర్ 09: ప్రతి గర్భిణి అంగన్వాడీలో తమ వివరాలను తప్పకుండా నమోదు చేయించుకోవాలని షాద్‌నగర్ ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి సూచించారు. పోషణ మాసోత్సవం కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం చౌలపల్లి, చించోడ్ గ్రామంలో పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారంతో పాటు రక్తహీనతకు గురికాకుండా ఆకుకూరలతో కూడిన ఆహారాన్ని ప్రతి రోజూ తీసుకోవాలన్నారు. ముఖ్యంగా గర్భిణులు సమయానికి ఆహారం తీసుకుంటే పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉంటారన్నారు. పౌష్టికాహారంతో కలిగే లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొన్నారు.