పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఐసీడీఎస్ సూపర్వైజర్ శబరి అన్నారు. గురువారం మండల పరిధిలోని సాలార్‌పూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్షంలో భాగంగా, సీమంతాలు, చిన్నారులకు అన్నప్రసాన, చిరుధాన్యాల ప్రాముఖ్యత, రక్తహీనత నివారించుట గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
- ఐసీడీఎస్ సూపర్వైజర్ శబరి
కడ్తాల్, మార్చి 21: పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఐసీడీఎస్ సూపర్వైజర్ శబరి అన్నారు. గురువారం మండల పరిధిలోని సాలార్‌పూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్షంలో భాగంగా, సీమంతాలు, చిన్నారులకు అన్నప్రసాన, చిరుధాన్యాల ప్రాముఖ్యత, రక్తహీనత నివారించుట గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిరుధాన్యాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారాన్ని మహిళలు తీసుకోవాలన్నారు. చిరుధాన్యాలతో పోషకాలు పుష్కలంగా లభిస్తాయని, మహిళలు, బాలింతలు, రక్తహీనత ఉన్న వారు వాటిని తీసుకోవాలని పేర్కొన్నారు.
అనంతరం ఏ ఊరిలోనూ పోషకలోపం ఉండకూడదనే ఉద్దేశంతో మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చరిత, అంగన్వాడీ టీచర్లు అంజమ్మ, సంగీత, శోభారాణి, ఆశాలు స్వరూప, లక్ష్మి, అనురూప, పాల్గొన్నారు.
ఆమనగల్లు : పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఐసీడీఎస్ సూపర్వైజర్ పార్వతి అన్నారు. మండలంలోని విఠాయిపల్లి, శంకర్కొండతండాల్లో గురువారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా (పోషణ పక్షం) కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి సూపర్వైజర్ పార్వతి హాజరై మా ట్లాడుతూ పోషక విలువలు కలిగిన ఆహారాన్ని బాలింతలు, గర్భిణులు తీసుకోవాలన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు రాధమ్మ, జయమ్మ, సుజాత, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

