ఇబ్రహీంపట్నం : స్వచ్ఛ సర్వేక్షన్ 2021 జాతీయస్థాయి అవార్డును ఇబ్రహీంపట్నం మున్సిపాలిటి సాధించిన సందర్భంగా ఆదివారం రాష్ట్ర ఐటీ పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారాకరామారావు మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, కమిషనర్‌తో పాటు అధికారులను అభినందించారు. పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో అవార్డులు అందుకున్న రాష్ట్రానికి చెందిన మున్సిపల్ చైర్పర్సన్లు, కమిషనర్లు, ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ ఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసంలో ప్రత్యేక సమావేశం అయ్యారు.
జాతీయ స్థాయిలో తెలంగాణ పట్టణాలకు గుర్తింపు రావడం పట్ల మున్సిపల్ చైర్పర్సన్లను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు రావడం పై మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతిని మంత్రి అభినందించారు.