ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 23: ఇబ్రహీంపట్నంలో సంచలనం రేపిన రియల్ఎస్టేట్ వ్యాపారుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డిని శనివా రం డీజీపీ మహేందర్‌రెడ్డి సస్పెండ్ చేశారు. ఇద్దరు రియ ల్ ఎస్టేట్ వ్యాపారుల హత్య కేసులో లంచం తీసుకుని నిందితులకు కొమ్ముకాశారనే ఆరోపణలపై ఇప్పటికే పోలీసుశాఖ రాచకొండ సీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది. బాలకృష్ణారెడ్డిని ఇబ్రహీంపట్నం ఏసీపీగా తప్పించిన తర్వాత విచారించగా అవినీతికి పాల్పడినట్లు తేలడంతో అతడిని రెండునెలల తర్వాత సస్పెండ్ చేశారు. అప్పటినుంచి ప్రత్యేక బృందంతో విచారించగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతులు రాఘవేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి నుంచి కూడా ఏసీపీ లంచం తీసుకున్నట్లు వెల్లడైంది. అలాగే, ఇదే కేసులో ఇప్పటికే సీపీ కార్యాలయానికి అటాచ్ చేసిన ఎస్ఐ విజయ్, హెడ్‌కానిస్టేబుల్ బాలకృష్ణలపై కూడా విచారణ జరుగుతున్నది. రియల్ఎస్టేట్ వ్యాపారుల హత్య కేసులో ప్రధాన నిందితుడు మట్టారెడ్డితోపాటు లేక్‌విల్లా రిసార్ట్స్ ప్లాట్ల యజమానుల అసోసియేషన్‌తోపాటు పలువురిని విచారించగా తాము ఏసీపీకి లంచం ఇచ్చినట్లు తెలిపారు.
ఇబ్రహీంపట్నం ఏసీపీలుగా విధులు నిర్వహిస్తూ ఇద్దరు ఏసీ పీలు ఇక్కడే సస్పెండ్ కావడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇక్కడ ఏసీపీగా పనిచేసిన మల్లారెడ్డి కూడా సస్పెం డ్ అయ్యారు. ఆయన స్థానంలో వచ్చిన యాదగిరిరెడ్డి సమర్థవంతంగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్లగా… ఆ పోస్టు లోకి వచ్చిన బాలకృష్ణారెడ్డి రియల్ఎస్టేట్ వ్యాపారుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ వేటుకు గురయ్యారు.
రంగారెడ్డి, ఏప్రిల్ 23, (నమస్తే తెలంగాణ): మైనార్టీ విద్యార్థులకు ఉచితంగా గ్రూప్ -1 నుంచి గ్రూప్-4 వరకు ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రత్నకుమారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ శిక్షణ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉం టుందని, 90 రోజులపాటు ఇస్తారన్నారు. ఆసక్తిగల అభ్యర్థు లు ఆన్లైన్లోhttp:docs.google.com/forms/ d//1 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను ఈనెల 30లోగా రంగారెడ్డి కలెక్టరేట్లోని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు.