Adibatla | ఆదిభట్ల, ఫిబ్రవరి 15 : ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా అధికారులు శనివారం పర్యటించారు. మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్లపై ప్రదాన కూడలిలో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు తొలగించారు. మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్, ఆదిభట్ల, మంగళ్‌పల్లి, బొంగుళూరు, నాగార్జునసాగర్ హైవే పై హోర్డింగ్‌లను తొలగించారు.
ఈ సందర్భంగా ఆదిభట్ల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో ని గ్రామాలలో 89 హోర్డింగ్‌లను గుర్తించామని తెలిపారు. అందులో అనుమతులు పొంది 80 హోర్డింగ్‌లు ఏర్పాటు చేయగా మరో 9 హోర్డింగ్‌లు ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేశారని అన్నారు. వాటిని పూర్తిగా తొలగిస్తున్నారని పేర్కొన్నారు. 80 హోర్డింగ్‌లకు రెన్యువల్ చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం రెన్యువల్ చేయడం ఆపేయడంతో రెన్యువల్ చేసుకోవడానికి ఎదురుచూస్తున్నారు. అనుమతులు లేకుండా హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.