చెట్ల పొదల్లో చిన్నారి మృతదేహం లభ్యం
పీర్జాదిగూడ ఫిబ్రవరి 8 : ఏ తల్లికి పుట్టిన ఆ చిన్నారి బరువుగా మారిందో.. తెలియదు గానీ అభం, శుభం తెలియని నెలల చిన్నారి చెట్ల పొదల్లో మృతి చెంది అగుపించింది. మాన వత్వం మరిచి పడే శారో, శిశువును విసిరేశారో వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటన మేడిపల్లి ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. శనివారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ వారిలోని ప్రధాన రహదారిలో ఉన్న డెకత్లాన్ షోరూం సమీపంలోని ఖాళీ ప్రదేశంలో ఉన్న చెట్ల పొదల్లో చిన్నారి మృతదేహం ఉన్నది గమనించిన స్థానికులు వెంటనే 100కు డయల్ చేసి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అప్పటికే కుళ్ళిపోయి వాసన వెదజల్లుతున్న చిన్నారి మృత దేహాన్ని పరిశీలించారు. సుమారు రెండు నెలల వయస్సు ఉంటుందని తెలిపారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
ఉప్పల్ లో గుర్తుతెలియని వ్యక్తి మృతి
ఉప్పల్, ఫిబ్రవరి 8 : ఉప్పల్ మెట్రో స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందారు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఒక 55 సంవత్సరాల వయసు గల మగ వ్యక్తి చనిపోయి ఉన్నాడు. చుట్టుపక్కల విచారించగా అతడు భిక్షాటన చేసి అక్కడే నివసిస్తున్నాడని తెలిసింది. అతడు బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ చెక్స్ షర్టు మరియు బ్రౌన్ కలర్ పాయింట్ ధరించి ఉన్నాడు. మృతుడి ఒంటిపైన ఎటువంటి గాయాలు లేవు. మృతదేహం డికంపోజర్ స్థితిలో ఉన్నది. చనిపోయి సుమారు రెండు రోజులు అయి ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుడికి ఎవరూ లేరని తెలిసింది. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి, పోలీసు లు దర్యాప్తు చేస్తున్నారు.
మాసబ్ చెరువును పరిశీలించిన హైడ్రా విచారణ అధికారి శ్యామ్ సుందర్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ ఏఈ వంశీధర్
Masab Cheruvu
తుర్కయంజాల్, ఫిబ్రవరి 8:తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి మాసబ్ చెరువును శనివారం హైడ్రా విచారణ అధికారి శ్యామ్ సుందర్ రెడ్డి , ఇరిగేషన్ శాఖ ఏఈ వంశీధర్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఇరిగేషన్ ఏఈ వంశీధర్ మాట్లాడుతూ తుర్కయంజాల్ మున్సిపాలిటీ మాసబ్ చెరువు పరిధి సర్వే నెంబర్ 175లో కొందరు వ్యక్తులు రాత్రి సమయంలో టిప్పర్ సహాయంతో మట్టి నింపుతున్నారనే ఫిర్యాదు మేరకు మాసబ్ చెరువును పరిశీలించినట్లు తెలిపారు. హైడ్రా టీమ్ సభ్యులు మట్టి పోసిన ప్రాంతాన్ని పరిశీలించినట్లు తెలిపారు. మట్టి నింపిన వ్యక్తులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటికే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేతనిజాంపేట, ఫిబ్రవరి8 : నిజాంపేటకు చెందిన శోభారాణికి రూ.15,500,శ్రావణ్‌కుమార్ రూ.60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరైనవి.ఈ మేరకు శనివారం స్థానిక నాయకులు బాధిత కుటుంబసభ్యులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సత్యనారయణ నాయకులు నసీరోద్దిన్,మహేందర్,వెంకటేశం,రాజిరెడ్డి,రాజేందర్‌గౌడ్,భూమగౌడ్,రాములు తదితరులు ఉన్నారు.
హబ్సిగూడలో ప్రాకాల్ప్ సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమము
Exibition
హబ్సిగూడలొని అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ లో శనివారం నాడు ప్రాకాల్ప్ సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమాని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అకడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ రిజనల్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి హాజరైనారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రకారకాల ప్రాజెక్టులు ,రోబొటిక్ వర్కింగ్ మొడల్స్ తయారు చేసారు. ఈ ప్రాజెక్టు గురించి విద్యార్థులు చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శివ కుమార్, పాఠశాల కరస్పాండెంట్ కల్పన, ఇన్ చార్జి, ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు.
మండల కేంద్రంలో సీఎం రేవంత్‌కు పాలాభిషేకం
Palabhishekham
కందుకూరు ఫిబ్రవరి 8 : కాంగ్రెస్ పార్టీ మండల యూత్ పార్టీ యూత్ అధ్యక్షుడు చూడకు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీసీలకు 42 శాతం కేటాయించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు .ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మాదిగలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు .ఎంతో కాల నుంచి పోరాడుతున్న మాదిగలకు గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు .కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ ఎండి అఫ్జల్ బేగ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.