కేశంపేట, ఫిబ్రవరి 5 : గ్రామాల్లో ప్రజలకు అవసరమయ్యే అభివృద్ధ్ది పనులకు అధిక ప్రాధాన్యమిస్తామని షాద్‌నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. మండలంలోని తొమ్మిదిరేకుల, లింగంధన, నిర్దవెళ్లి, బొదునంపల్లి గ్రామాల్లో శనివారం ఎన్ఆర్ఈజీఎస్, సీడీపీ నిధులతో సీసీరోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెప్రగతితో ప్రతి గ్రామం క్లీన్ అండ్ గ్రీన్‌గా మారిందన్నారు. ఇప్పటికే ప్రజల అవసరాలకు రైతు వేదికలు, వైకుంఠధామాలు, ఇంటింటికీ తాగునీరు అందజేస్తున్నామని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలతో నిరుపేదలకు న్యాయం చేకూరుతుందన్నారు. పేదల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యేను ఆయా గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సావిత్రీ బాల్‌రాజ్‌గౌడ్, పార్వతమ్మ, ఎదిరె కళమ్మ, నవీన్‌కుమార్, వెంకట్‌రెడ్డి, ఎంపీపీ రవీందర్‌యాదవ్, జడ్పీటీసీ విశాల, పీఏసీఎస్ చైర్మన్ జగదీశ్వర్‌గౌడ్, వైస్ చైర్మన్ అంజిరెడ్డి, ఎంపీటీసీలు మల్లేశ్‌యాదవ్, యాదయ్య, మండల కోఆప్షన్ జమాల్‌ఖాన్, ఎంపీడీవో రవిచంద్రకుమార్‌రెడ్డి, పీఆర్ఏఈ భూపాల్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, నాయకులు లక్ష్మీనారాయణగౌడ్, వెంకటయ్య, పర్వత్‌రెడ్డి, సురేందర్, కృష్ణయ్య, మధుసూదన్‌గౌడ్, లక్ష్మయ్య, జంగయ్య పాల్గొన్నారు.
షాద్‌నగర్ : షాద్‌నగర్ మున్సిపాలిటీ ప్రజలకు ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందించేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. షాద్‌నగర్ పట్టణంలో నూతనంగా నిర్మించిన విజయనగర్ కాలనీ, కేశంపేట్ రోడ్డు, మిషన్‌భగీరథ నల్లాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఎండకాలం వస్తే షాద్‌నగర్ ప్రజల గొంతులు ఎండుతుండేవని, స్వరాష్ట్రంలో ఆ తిప్పలు తప్పి ఇంటింటికీ సురక్షిత మంచినీళ్లు అందుతున్నాయని చెప్పారు. మిషన్ భగీరథ పనులు తుది దశకు చేరుకున్నాయని, రెండు, మూడు కాలనీలు మినహా అన్ని కాలనీల్లో తాగునీళ్లు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారని, ఇప్పటికే సగానికి పైగా వార్డుల్లో నివాసాలకు తాగునీళ్లు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, మాజీ చైర్మన్ విశ్వం, కౌన్సిలర్లు విశాల, మాధవి, నందీశ్వర్, శ్రీనివాస్, నాయకులు ఏజాజ్ అడ్డు, శ్రీశైలం, శేఖర్, రఘుమారెడ్డి, జమృత్‌ఖాన్, శంకర్, శరత్ పాల్గొన్నారు.