ఇబ్రహీంపట్నం, జులై 18 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నియోజకవర్గంలో పంటపొలాలకు జీవం పోసినట్లయ్యింది. గత ఇరవైరోజుల క్రితం కురిసిన వర్షాలకు రైతులు వ్యవసాయ పొలాల్లో విత్తనాలు విత్తారు. దీంతో గురు, శుక్రవారాల్లో కురిసిన వర్షాలకు పంటలకు జీవం పోసినట్లయ్యింది. దీంతో రైతులు తమ పంటపొలాల్లో నాటిన నారుతో పాటు ఆరుతడి పంటలకు జీవం ఈ వర్షాలు జీవం పోసాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాల్లో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు పెద్ద ఎత్తున ప్రవహిస్తోంది.