స్వాగత తోరణాలు.. హరిత వృక్షాలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం పథకం ఫలాలు ప్రజలకు అందుతున్నాయి.
- గ్రామాల్లో ఆహ్లాదాన్ని పంచుతున్న పచ్చని చెట్లు
షాద్నగర్, డిసెంబర్ 30 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం పథకం ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. నాలుగేండ్ల క్రితం నాటిన మొక్కలు వృక్షాలుగా మారి గ్రామాలకు స్వాగత తోరణాలుగా మారాయి. గ్రామాల ప్రజలు, వాహనదారులకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందిస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అనే విషయాన్ని చాటిచెబుతున్నాయి. నాడు చెట్లను నరకడం తప్ప నాటే వారు లేకుండే అనే భావన నుంచి నేడు అన్ని వర్గాల ప్రజలు కనీసం ఒక్కచెట్టునైనా పెంచాలనే ఆలోచనకు వచ్చారు.
ఫలితంగా అన్ని ప్రాంతాల్లో హరితహారం విజయవంతంగా కొనసాగడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటుఅవుతుంది. కొత్తూరు మండలం ఎస్బీ పల్లి, నందిగామ మండలం బుగ్గోనిగూడ గ్రామాలకు వచ్చే ప్రధానదారులకు ఇరువైపులా నాటిన మొక్కలు పెరిగి వృక్షాలుగా మారాయి. దారిపొడవునా వనాలను తలపిస్తున్నాయి. రాకపోకలు సాగించే వాహనదారులు, గ్రామాల ప్రజలను హరిత వృక్షాలు ఆకర్షిస్తున్నాయి. ప్రభుత్వం సంకల్పం నెరవేరుతుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

