షాద్‌నగర్, జూన్ 29 : ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబల్నాయక్ను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆదివారం పరామర్శించారు. నాలుగు రోజుల కిందట రాంబల్‌నాయక్ తండ్రి గోప్యానాయక్(80) మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ఆయన కేశంపేట మండలంలోని ఎక్లాస్‌ఖాన్‌పేట గ్రామ పరిధిలోని పొడగుట్టతండాకు చేరుకొని రాంబల్నాయక్ను పరామర్శించారు. ఈ సందర్భంగా గోప్యానాయక్ చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడొద్దని, ధైర్యంగా ఉండాలని మనోధైర్యం కల్పించారు.
రాంబల్నాయక్ను పరామర్శించిన వారిలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, జైపాల్‌యాదవ్, పట్నం నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బీఆర్ఎస్ యువ నాయకుడు రవీందర్‌యాదవ్ ఉన్నారు.
ఇందులో భాగంగా ఎక్లాస్‌ఖాన్‌పేట గ్రామ శివారులో మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ నేతలు మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, కేశంపేట, ఫరూఖ్‌నగర్ మండలాల అధ్యక్షులు మురళీధర్‌రెడ్డి, లక్ష్మణ్‌నాయక్, మాజీ జడ్పీటీసీ పల్లె నర్సింగ్‌రావు, షాద్‌నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ నరేందర్, సీనియర్ నాయకులు నారాయణరెడ్డి, దేవేందర్‌యాదవ్, ఎమ్మె సత్యనారాయణ, శ్రీధర్‌రెడ్డి, ఆయా గ్రామాల మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు.
హరీశ్‌రావుకు స్వాగతం పలికిన బీఆర్ఎస్ నాయకులు
కొత్తూరు : ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబల్నాయక్ను పరామర్శించేందుకు వచ్చిన మాజీ మంత్రి హరీశ్‌రావుకు కొత్తూరు బీఆర్ఎస్ నాయకులు ఆదివారం ఘన స్వాగతం పలికారు. షాద్‌నగర్ నియోజకవర్గం ముఖ్య ద్వారం తిమ్మాపూర్ వద్ద బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కడెంపల్లి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మె సత్యనారాయణ తదితరులు హరీశ్‌రావును సత్కరించారు. కార్యక్రమంలో కొత్తూరు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.