వికారాబాద్ జిల్లాలో ఆశాజనకంగా వేరుశనగ సాగు
వికారాబాద్ జిల్లాలో ఈ ఏడాది యాసంగిలో సాగు చేస్తున్న వేరుశనగ పంట ఆశాజనకంగా ఉన్నది. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురువడంతో బోర్లలో భూగర్భజలాలు పెరిగాయి. రైతులు ప్రతి ఏటా వ్యవసాయ బోర్ల కిందే యాసంగిలో వేరుశనగ పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్పేట మండలంలో వేరుశన
- ఈ ఏడాది యాసంగి సీజన్లో 17,200 ఎకరాల్లో..
- జనవరి, ఫిబ్రవరి నెలల్లో పంట చేతికొచ్చే అవకాశం
- బొంరాస్పేట మండలంలో ఎక్కువగా సాగు
- దిగుబడి అధికంగా వస్తుందంటున్న అన్నదాతలు
బొంరాస్పేట, డిసెంబర్ 6: వికారాబాద్ జిల్లాలో ఈ ఏడాది యాసంగిలో సాగు చేస్తున్న వేరుశనగ పంట ఆశాజనకంగా ఉన్నది. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురువడంతో బోర్లలో భూగర్భజలాలు పెరిగాయి. రైతులు ప్రతి ఏటా వ్యవసాయ బోర్ల కిందే యాసంగిలో వేరుశనగ పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్పేట మండలంలో వేరుశనగను ఎక్కువగా రైతులు సాగు చేస్తున్నారు. ప్రభుత్వం రాయితీపై అందించిన తుం పర సేద్యం పరికరాలకు సద్వినియోగం చేసుకుని వ్యవసా య బోర్ల కింద ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ వస్తున్నారు. వీటికి తోడు వ్యవసాయానికి ప్రభుత్వం 24 గంటలపాటు నిరంతర విద్యుత్ను సరఫరా చేస్తుండటంతో సాగు విస్తీర్ణం పెరిగింది. వికారాబాద్ జిల్లాలో ఈ ఏడాది యాసంగిలో 17,200 ఎకరాల్లో వేరుశనగ పంట సాగైంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పంట చేతికొచ్చే వచ్చే అవకాశం ఉన్నది. దిగుబడులు ఆశాజనకంగా వచ్చి లాభాలు వస్తాయని రైతులు ఆశతో ఉన్నారు.
అడవి పందుల బెడద..
పంటచేతికొచ్చే దశలో అడవి పందుల బెడద నుంచి పం టను కాపాడుకోవడం రైతులకు ఓ సవాలుగా మారింది. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో అడవి పందుల బెడద తీవ్రంగా ఉన్నది. రాత్రివేళల్లో పంటపై పందులు గుంపులుగా దాడి చేసి పంటనంతా నాశనం చేస్తుంటాయి. పందుల బారి నుం చి రక్షించుకునేందుకు రైతులు పంట చుట్టూ పాత చీరలను కడుతున్నారు. కొందరు రైతులు రాత్రిపూట పొలాలకెళ్లి పం దులు రాకుండా బాణసంచా కాల్చడం, మంట పెట్టడం, పొలాల చుట్టూ లైట్లు వేసి కాపాడుకుంటున్నారు.
తెగుళ్ల నివారణకు చర్యలు
వేరుశనగ పంటకు ఆకు ముడుత, పొగాకు లద్దె పురుగు, ఆకుమచ్చ తెగులు వంటివి వ్యాపిస్తాయని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.అక్కడక్కడా పంటకు ఆకుముడుత పురుగు ఉందని, విత్తిన 15 రోజుల నుంచి 45 రోజుల వ్యవధిలో ఉన్న పంటపై ఈ పురుగు ఆశిస్తుందని, దీని నివారణకు ఎసిఫెట్ 300 గ్రాముల మందును 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలని సూచిస్తున్నారు. పలు చోట్ల తిక్కా ఆకుమచ్చ తెగులును గుర్తించామని.. ఈ తెగులు ఎక్కువగా విత్తనశుద్ధి చేయకపోవడంతో ఆకుల పై నల్ల మచ్చలుగా ఏర్పడుతుందని, ఇది విత్తిన 30 రోజుల వ్యవధిలో ఆశిస్తుందని.. దీని నివారణకు క్లోరాంట్రోనిల్ప్రోల్ 400 గ్రాముల మం దును 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరా పొలాని కి పిచికారీ చేసుకోవాలన్నారు. పొగాకు లద్దె పురుగు నివారణకు నొవాల్యురాన్ 200 ఎంఎల్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరా పొలానికి పిచికారీ చేయాలన్నారు. రసం పీల్చే పురుగులైన తామర, దీపపు పురుగుల నివారణ కు 100 గ్రాముల ధమోమిథాక్సామ్ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
వేరుశనగ పంటలో రైతులు ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వ్యవసాయాధికారులు సలహాలు, సలహాలను పాటించి మందులు వాడాలి. విత్తనాలు వేసిన 45 రోజుల పంటకు జిప్సం వాడితే ఊడలు బాగా దిగడంతోపాటు కాయ గట్టిపడి దిగుబడి అధికంగా వస్తుంది. అదేవిధంగా తెగుళ్ల నివారణకు అధికారులు సూచించిన మందులను సరైన మోతాదులో వాడాలి. – పద్మావతి ఏవో, బొంరాస్పేట
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

