కొడంగల్, డిసెంబర్ 8 : అకాల వర్షం తమను నిండా ముంచిందని.. తీరని నష్టాన్ని మిగిల్చిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తే మ శాతాన్ని తగ్గించేందుకు రోడ్లపై ఆరబెట్టిన వరి ధాన్యం ఇటీవల కురిసిన వానలకు తడిసిపోవడంతో రైతన్న తీవ్ర ఇబ్బందులకు గురవుతు న్నాడు. నానిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే అక్కడి సిబ్బంది 14% లోపు తేమ ఉంటేనే కొంటామని కరాఖండిగా చెబుతున్నారని వాపోతున్నాడు. తేమ శాతం 17 వరకు ఉన్నా కొనాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నా వారు మాత్రం కొనడం లేదని పేర్కొంటున్నాడు.
రోడ్లపై ఆరబోసిన వందలు, వేల బస్తాల ధాన్యం ఇటీవల కురిసిన అకాల వర్షానికి తడిసి ముైద్దెందని.. వాతావరణం మేఘావృతంగా ఉండడంతో ఆరబెట్టినా సరి గ్గా ఎండక మొలకెత్తే ప్రమాదం ఉన్నదని కంటతడి పెడుతున్నారు. తడిసి న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే అక్కడి సిబ్బంది తిరిగి పం పిస్తున్నారని.. తమ పంటను కొనుకుంటే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నదని బాధపడుతున్నారు. పంటల సాగుకు చేసిన అప్పులను తీర్చే మార్గమే ఉండదని, తమ బతుకులు అగమ్యగోచరమేనని పేర్కొంటున్నా రు. అకాల వర్షం తమకు అపార నష్టాన్ని మిగిలించిందని.. ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యాన్ని తేమ శాతంతో సంబంధం లేకుండా కొనేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కొర్రీలతో తప్పని అవస్థలు..
వరి ధాన్యాన్ని విక్రయించుకునేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్ర భుత్వం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటైనా అక్కడి కొర్రీలతో అవస్థలు పడుతున్నాం. తేమ శాతం 17 ఉన్నప్పటికీ ధాన్యాన్ని కొనాలని నిబంధనలున్నా 14 శాతం తేమ ఉన్నా అక్కడి సిబ్బంది కొనుగోళ్లు చేపట్టడం లేదు. గతంలో ముందుగా ఖాళీ బస్తాలు ఇచ్చేవారు.. ఇప్పుడు ఇవ్వడం లేదు. దాంతో పంటను ఎక్కడ, ఎలా నిల్వ చేసుకోవాలో అర్థం కావడం లేదు. బస్తాల్లేక ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించలేకపోతున్నాం.
-బుగ్గప్ప, అప్పాయిపల్లి, కొడంగల్
తడిసిన ధాన్యాన్ని చూస్తే ఏడుపొస్తున్నది..
తడిసిన ధాన్యాన్ని చూస్తే ఏడుపొస్తున్నది.. తేమ శాతాన్ని తగ్గించేందుకు రోడ్లపై ఆరబెట్టిన వరి ధాన్యం అకాల వర్షం తో పూర్తిగా తడిచిపోయింది. ఆ ధాన్యాన్ని ప్రభుత్వం కొంటేనే నష్టపోకుండా ఉంటా. అప్పులు చేసి పంటను సాగు చేశా. అసలే పంట దిగుబడి తక్కువగా వచ్చింది. దానికి తోడు వర్షంతో పూర్తిగా తడిచి పో యిం ది. దానిని చూస్తుంటే కంట నీరు ఆగడం లేదు. కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే తేమ శాతం ఎక్కువగా ఉన్నదని తిప్పి పంపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తడిచిన ధాన్యాన్ని కొనేలా చర్యలు తీసుకోవాలి.
– బుగ్గమ్మ, అప్పాయిపల్లి, కొడంగల్