శంషాబాద్ రూరల్, జూలై 18: తెల్లవారుజామున కురిసిన వర్షానికి ప్రభుత్వ పాఠశాల ఆవరణ చెరువును తలపిస్తుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ (Shamshabad) మండలం రామంజపూర్ ప్రభుత్వ పాఠశాల ఆవరణ నీటితో నిండిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారం నిర్వహిస్తున్నా ఆచరణలో మాత్రం అమలు కావడం లేదని పలువురు గ్రామస్తులు మండిపడుతున్నారు. పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిలవకుండా తగిన చర్యలు తీసుకొని విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.