వికారాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : దాదాపుగా రూ. 30 కోట్లు వెచ్చించి నిర్మించారు.. సాక్షాత్తు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, స్పీకర్ ప్రసాద్‌కుమార్ మెడికల్ కాలేజీ అనుబంధ ఆస్పత్రిని ప్రారంభించి.. నెల రోజులు దాటినా ఇంకా వైద్య సేవలు షురూ కాకపోవడంతో రోగులు, ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుతుందని భావించిన తమకు ఇంకా ఎదురు చూపులే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి జిల్లా కో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఖరీదైన వైద్య విద్యను ఉచితంగా అందుబాటులో తీసుకొచ్చారు. అదేవిధంగా పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను అం దించేందుకు ప్రతి ప్రభుత్వ మెడికల్ కాలేజీకీ అనుబంధంగా ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా 380 ప్రభుత్వ జనరల్ దవాఖానతోపాటు 20 పడకల ఐసీయూ కలిపి మొత్తం 400 పడకల ఆస్పత్రి నిర్మాణానికి రూ.30 కోట్లను విడుదల చేయగా దాదాపుగా పనులు పూర్తయ్యాయి.
అయితే, చిన్న చిన్న పనులు పెండింగ్‌లో ఉండడంతో కాం గ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది పాటు నయాపైసా కేటాయించకపోవడంతో ఆ పనులు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. జిల్లా ప్రజాప్రతినిధులపై ప్రజ ల నుంచి ఒత్తిడి పెరగడంతో ఏడాది తర్వాత ప్రభుత్వం నిధులను కేటాయించగా పనులను పూర్తి చేశారు. అయితే, ఆ 400 పడకల ఆసుపత్రిని ప్రారంభించి నెల రోజులు కావొస్తున్నా వైద్య సేవలు మాత్రం ఇంకా ప్రారంభం కాకపోవడంతో ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. సాక్షాత్తు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రారంభించినా వైద్యసేవలు ప్రా రంభం కాకపోవడం గమనార్హం.
తమ కు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అం దుతాయని భావించగా..సర్కార్ నిర్లక్ష్యంతో అందడంలేదని పలువురు మండిపడుతున్నారు. తమకు 18 నెలలుగా ఎదురుచూపులు మిగిలా యని పేర్కొంటున్నారు. మరోవైపు జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎంబీబీఎస్ విద్యార్థులకు సంబంధించి రెండో సంవత్సరం ప్రారంభం కావడంతో ప్రాక్ట్టికల్ తరగతులను వికారాబాద్‌లోని సీహెచ్‌సీ ఆసుపత్రిలో నిర్వహిస్తున్నారు.