కులకచర్ల, మే 2 : గౌడన్నల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం కులకచర్ల మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామంలో గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ ఉద్యోగులు నెలకొల్పిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గౌడ కులస్తులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానాన్ని కల్పిస్తూ వారి అభివృద్ధికి కృషిచేస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో గౌడలకు మరిన్ని పథకాలు అందించేందుకు సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
పాపన్నగౌడ్ ఆశయాలను ప్రతిఒక్కరూ ఆచరించాలి
పరిగి నియోజకవర్గంలో పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఇప్పాయిపల్లి గ్రామంలో ఏర్పాటు చేయడం సంతోషదాయకమని ఎమ్మెల్యే తెలిపారు. అన్ని వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన గొప్ప మహనీయుడు పాపన్నగౌడ్ అని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని తెలిపారు. ఆయన విగ్రహాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అందరూ సమష్టిగా గ్రామాల అభివృద్ధికి కృషిచేయాలని కోరారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన తన నిధుల నుంచి మొదటి విడుతగా రూ.5లక్షలను భవన నిర్మాణానికి మంజూరు చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రూ.50,000 విరాళం ఆయన అందజేశారు. కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర నాయకులు రామారావు, జయంతిగౌడ్, ఎంపీపీ సత్యమ్మ, జడ్పీటీసీ రాందాస్‌నాయక్, ఏఎంసీ చైర్మన్ హరికృష్ణ, ఏఎంసీ వైస్ చైర్మన్ నాగరాజు, ఇప్పాయిపల్లి సర్పంచ్ అనురాధ, ఎంపీటీసీ పద్మ, మండల గౌడ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్యగౌడ్, ప్రధాన కార్యదర్శి రాములుగౌడ్, గౌడ సంఘం ఇప్పాయిపల్లి గ్రామ అధ్యక్షుడు మల్లయ్యగౌడ్, గ్రామ కమిటీ నాయకులు నర్సింహులుగౌడ్, రాములుగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, రాంచంద్రయ్యగౌడ్, యాదయ్యగౌడ్, నరేశ్‌గౌడ్, రాజుగౌడ్, రాముగౌడ్, అంజిగౌడ్, ఏసీఎఫ్ చైర్మన్ అశోక్‌కుమార్, బీఆర్ఎఎస్ పార్టీ చౌడాపూర్ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, నాయకులు భీంరెడ్డి, బీఎస్ ఆంజనేయులు, రాజప్ప, పీఎన్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు రాఘవేందర్‌గౌడ్, వివిధ గ్రామాల గౌడ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి హాజరై రూ.50,000 విరాళం అందించారు. గౌడలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలని సూచించారు. గౌడల అభ్యున్నతికి ప్రభుత్వం కృషిచేస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.