శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Aug 14, 2020 , 23:40:05

ప్రభుత్వ చీఫ్‌విప్‌ టీఆర్‌ఎస్‌ కార్యాలయ పరిశీలన

 ప్రభుత్వ చీఫ్‌విప్‌ టీఆర్‌ఎస్‌ కార్యాలయ పరిశీలన

 దుండిగల్‌, ఆగస్టు14: కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం, దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధి, గండిమైసమ్మలో నిర్మించిన మేడ్చల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ కార్యాలయ భవనాన్ని ప్రభుత్వ చీఫ్‌విప్‌, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు శుక్రవారం సందర్శించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్‌ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్‌రాజు, తాడూరి శ్రీనివాస్‌ ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా టీఆర్‌ఎస్‌ కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. భవన నిర్మాణం పనులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశానుసారం తాము జిల్లా పార్టీ కార్యాలయాన్ని సందర్శించామని పేర్కొన్న వెంకటేశ్వర్లు త్వరలోనే భవనాన్ని ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, జగన్‌, మాజీ జడ్పీవైస్‌ చైర్మన్‌ బి.ప్రభాకర్‌రెడ్డి, సీనియర్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు కొలన్‌ గోపాల్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ సురేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.