శంకర్పల్లి సెప్టెంబర్ 14 : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలందరూ పని చేయాలని శంకర్పల్లి మాజీ ఎంపిపి ధర్మన్నగారి గోవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామంలో బీఆర్ఎస్ యువజన విభాగాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్‌గా మర్రివాగు రాఘవేందర్, వైస్‌ప్రెసిడెంట్‌గా తంగెడిపల్లి రాము, జనరల్ సెక్రెటరీగా కవ్వగూడెం అనిల్, జాయింట్ సెక్రెటరీగా టంగటూర్ చంద్రశేఖర్‌ని ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా గోవర్ధన్‌రెడి మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల్లో పూర్తిస్థాయిలో అన్ని స్థానాలను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్త ఐక్యమత్యంతో కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సురేందర్‌రెడ్డి, విలేజ్ ప్రెసిడెంట్ గౌండ్ల లక్ష్మణ్, మండల యూత్ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.