కొడంగల్, మే 28: శ్రీ సత్య సాయి భజన మండలి కొడంగల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి పరీక్షలకు విశేష స్పందన లభించింది. బుధవారం స్థానిక అక్షర హై స్కూల్ ఆవరణలో శ్రీ సత్య సాయి భజన మండలి కొడంగల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ చెందిన శంకర కంటి హాస్పిటల్ సిబ్బంది ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వర్ష మాట్లాడుతూ శరీరంలోని అన్ని భాగాల్లో కండ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని, కంటి చూపు మందగిస్తే ఒకరిపై ఆధారపడి జీవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఆలా కాకుండా కంటి సమస్యలు ఏర్పడిన వెంటనే వైద్యులను సంప్రదించిం చూపును కాపాడుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఉచిత వైద్య శిబిరంలో మొత్తం 186 మంది పాల్గొనగా అందులో 20 మందికి కంటి సమస్యలను గుర్తించి వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను హైదరాబాద్ శంకర హాస్పిటల్ తరలించినట్లు పేర్కొన్నారు. శంకర హాస్పటల్ సిబ్బంది సోనం అంజలి, ప్రత్యూష, విజయకుమార్, రాధేశ్యాం లతోపాటు కొడంగల్ సత్యసాయి భజన మండలి సభ్యులు పాల్గొన్నారు .