కొడంగల్, సెప్టెంబర్ 29: బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాతే గ్రామాల ప్రగతికి నాంది ఏర్పడిందని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని పోచమ్మ తండాలో రూ.కోటి 50లక్షల వ్యయంతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన, రూ. 50లక్షలతో నిర్మించిన బిడ్జ్రిని ప్రారంభించారు. అంగడిరైచూర్ గ్రామంలో రూ.ఐదులక్షల తో నిర్మించనున్న సీసీ రోడ్డు, ధర్మాపూర్ గ్రామంలో రూ.2కోట్ల 70లక్షలతో ఏర్పాటు చేయనున్న బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అదే విధంగా కస్తూర్పల్లి గ్రామంలో రూ.7లక్షలతో నిర్మించిన పాఠశాల ప్రహరీ, రూ.20లక్షలతో నిర్మించిన వైకుంఠదామాన్ని ప్రారంభించడంతో పాటు రూ.20లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్న రేవంత్‌రెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు.
పది సంవత్సరాల్లో నియోజకవర్గానికి కనీసం పదిసార్లు వచ్చిన పాపాన పోలేదని, స్వప్రయోజనాల కోసమే కొడంగల్‌ను అడ్డుపెట్టుకు న్న ట్లు ధ్వజమెత్తారు. ధర్మాపూర్‌లో పాఠశాల భవన నిర్మా ణానికి రూ. 10 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా రూ.10లక్షలతో అంగన్వాడీ భవనం, సీసీ రోడ్డు నిర్మాణానికి రూ. ఐదులక్షలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిగాగెలిపించుకుందామన్నారు.ఈ సమావేశాల్లో సర్పంచ్‌లు శంకర్‌నాయక్, వెంకట్‌రెడ్డి, సయ్యద్ అంజద్, గోవింద్, శిరీషాగౌడ్, వైస్ ఎంపీపీ రహ్మత్‌ఖాన్, మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్‌రావు యాదవ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడుదామోదర్రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ బస్వరాజ్, బీఆర్ఎస్ నాయకులు బిచ్చిరెడ్డి, నారాయణరెడ్డి, రఘుపతిరెడ్డి, నరోత్తంరెడ్డి, రాంరెడి, మల్లిఖార్జున్, మధుసూదన్‌రెడ్డి, చిన్ననందిగామ సాయిలు పాల్గొన్నారు.