ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 14 : మాజీ సర్పంచ్లు ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతోపా టు.. తమ సొంత డబ్బు.. ఇతరుల వద్ద అప్పులు తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధికి కృ షి చేశారు. అయితే వాటికి సంబంధించిన బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం ప లు అభివృద్ధి పనులకు ప్రొసీడింగ్లు ఇచ్చి నిధులు కేటాయించింది. ఆ పనులు చురుగ్గా సాగుతున్న తరుణంలో అసెంబ్లీ ఎన్నికలు రావడం..కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కార్ గ్రామపంచాయతీల్లో నిధులున్నా వాటిని చెల్లించొద్దని ట్రెజరీలకు ఆదేశాలిచ్చింది.
దీం తో తాము చేపట్టిన పనులకు బిల్లులివ్వా లంటూ మాజీ సర్పంచ్లు పోరుబాట పట్టినా.. పెండింగ్ బిల్లులను చెల్లించాలని ముఖ్యమంత్రి, మంత్రులకు వినతిపత్రాలిచ్చినా.. సీఎంకు పోస్టుకార్డులు రాసినా వారి గోడును ఎవరూ పట్టించుకోవడం లేదు. అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఆర్థికంగా సతమతమవుతున్నామని.. పిల్లల చదు వు, కుటుంబ పోషణ భార మైందని కాం గ్రెస్ సర్కార్ స్పందించి పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరుతున్నారు.
పదవీకాలం ముగిసి ఏడాది దాటినా నేటికీ మాజీ సర్పంచ్లకు పెం డింగ్ బిల్లులు అందకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభు త్వం నుంచి స్టేట్ ఫైనాన్స్, 15వ ఆర్థికసంఘం నిధులతోపాటు ‘మన ఊరు-మన బడి’లో భాగంగా చేపట్టిన పనులకూ బిల్లు లు రావాల్సి ఉన్నది.
గత కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముం దు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి గ్రా మాల్లో ప్రగతి పనులను పరుగులు తీయించింది. గ్రామాల్లో పనులు చేస్తే తమను ప్రజలు జీవితాంతం గుర్తుంచుకుంటారనే తపనతో అప్పట్లో సర్పంచ్లు అధిక వడ్డీలకు అప్పులు చేసి పనులను చేపట్టారు. తదనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది.
చేసిన అప్పులను చెల్లించేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన దుస్థితి వచ్చిందని పలువురు మాజీ సర్పంచ్లుకరుణించని సర్కారు.. పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పం చ్లు పలుమార్లు ప్రభుత్వ పెద్దలను కలిసి వినతిపత్రాలను సమర్పించారు. ముఖ్యమంత్రికి పోస్టుకార్డుల ద్వారా కూడా విజ్ఞప్తి చేశా రు. అయినా బిల్లులు మంజూరు కాకపోవడంతో చలో అసెంబ్లీ, చలో సచివాలయ ము ట్టడి కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఆ కా ర్యక్రమాలకు మాజీ సర్పంచ్లు వెళ్లకుండా ప్రభుత్వం పోలీసులతో ముందస్తు అరెస్టులు చేయించింది. ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా తమ జీవితాలతో చెలగాటమాడుతున్నదని పలువురు మండిపడుతున్నారు.
గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టితే పేరొస్తుందన్న ఉద్దేశంతో తెలిసిన వారి వద్ద అప్పులు తెచ్చి పనులు చేపట్టా. అయితే.. బీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరు గుతున్నది. తీసుకొచ్చిన అప్పులకు ఏడాదికిపైగా వడ్డీలు చెల్లించలేక సతమతమవుతున్నా. కుటుంబ పోషణా భారంగా మారింది.
-చిలుకల యాదగిరి, మాజీ సర్పంచ్ తులేకలాన్
గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సుమారు రూ.30 లక్షల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వాటి చెల్లింపుల్లో కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నది. కాంగ్రెస్ సర్కారు మాజీ సర్పంచ్ల జీవితాలతో చెలగాటమాడుతున్నది.
-హరిప్రసాద్, మాజీ సర్పంచ్, అస్మత్పూర్