పంచాయతీ ఎన్నికల వేళ.. గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రచారం ఊపందుకున్నది. పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించేందుకు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లు రంగం లోకి దిగారు. ఊర్లలో ఇంటింటికీ తిరుగుతూ కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్లను అడుగుతున్నారు. అలాగే, రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఏమీ జరిగిందో తెలుపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు ఎలాంటి హామీలిచ్చారో.. 420 హామీలిచ్చి గద్దెనెక్కి ఇప్పుడు వాటి ఊసేత్తకుండా ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో వివరిస్తూ.. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని.. సర్పంచ్‌లుగా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు.
బషీరాబాద్, డిసెంబర్ 8 : కాంగ్రెస్ పార్టీ నాయకులు తాం డూరులో కొత్తగా రౌడీయిజం, గూండాయిజం మొదలెట్టార ని తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సోమవారం మండలంలోని రెడ్డిఘణపూర్, మంతట్టి, మల్కన్‌గిరి, నవల్గా, నవాం ద్గి, దామర్చేడ్, ఎక్మాయి తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల తరఫున ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు అడ్డొచ్చే వారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నారని, గ్రామానికి ఒకటి, రెండు ఇండ్లు ఇచ్చి ప్రజలను మభ్యపె
డుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని ప్రజలు గమనించి.. పంచాయతీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నా రు. 420 హామీలిచ్చి గద్దెనెక్కి ఇప్పుడు వాటి ఊసేత్తకుండా ప్రజలను మోసం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో కరెంట్ లేక, మంచినీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లోకి వస్తే నిలదీయాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినధి పంజుగుల శ్రీశైల్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నర్సిరెడ్డి, సీనియర్ నాయకులు శంకర్‌రెడ్డి, మంతట్టి కృష్ణ, ఆయా గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించండి
కొత్తూరు : గ్రామ సమస్యలు పరిష్కారం కావాలంటే బ్యాట్ గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థిని జయప్రదాజగన్మోహన్రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని తీగాపూర్‌లో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. బ్యాట్గుర్తుకు ఓటేసి జయప్రదను గెలిపిస్తే తీగాపూర్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నా రు. జగన్మోహన్రెడ్డి ఎంపీటీసీగా ఉన్నప్పుడు గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. జగన్మోహన్రెడ్డి విజయలక్ష్మి బస్టాప్ నుంచి చేగూర్ వరకు రోడ్డు ను నిర్మించారని చెప్పారు. గ్రామ సమస్యలు పరిష్కారం కావాలంటే బ్యాట్ గుర్తుకు ఓటేసి జయమ్మను గెలిపించాలన్నారు.
బీఆర్ఎస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి
నందిగామ : సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పిలుపునిచ్చారు. మండలంలోని తళ్లగూడ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీకాంత్‌గౌడ్‌కు మద్దతుగా సోమవారం మాజీ ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు అస్తవ్యస్తంగా మారాయని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రాష్ర్టాభివృద్ధి కుంటుపడింది
కొడంగల్ : కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందున్నదని.. గత 23 నెలల్లో తెలంగాణ ఆగమైందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని మం డలంలోని రుద్రారంలో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్, వార్డు సభ్యుల తరఫున ప్రచారం చేసి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నారని.. కేసీఆర్ అందించిన ప్రోత్సాహంతో ఇతర ప్రాం తాలకు వలస వెళ్లిన వారు కూడా స్వగ్రామాలకు తిరిగొచ్చి.. పంటలను సాగు చేసుకుంటూ జీవించారన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రాష్ర్టాభివృద్ధి కుంటుబడి పోయిందని విమర్శించారు. ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి పాటుపడే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షులు దామోదర్‌రెడ్డి, రుద్రారం సర్పంచ్ అభ్యర్థి ఎల్లప్ప, నాయకులు మధుసూదన్‌రావు యాదవ్, రాఘవేందర్‌రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.