తాండూరు, నవంబర్ 4 : పాలకుల నిర్లక్ష్య మే ప్రయాణికులకు శాపంగా మారిందని తాండూరు యువకులు మండిపడ్డారు. తాండూరు డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యం లో మంగళవారం తాండూరులో రోడ్లను వెంటనే బాగు చేయాలని ఆందోళన చేపట్టా రు. తాండూరు-హైదరాబాద్, తాండూరు-మహబూబ్‌నగర్, తాండూరు-చించొల్లి, తాండూరు-కోట్‌పల్లి మార్గంలో రోడ్లు గతుకులుగా మారినా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ము ఖ్యంగా తాండూరు-హైదరాబాద్ మార్గంలోని రోడ్డు బాగా లేకపోవడంతోనే సోమవారం చేవెళ్ల దగ్గర బస్సు ప్రమాదం జరిగిందని మృతుల కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఆందోళనలో పాల్గొని సర్కారు తీరును దుయ్యబట్టా రు.
బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలంటే వెంటనే రోడ్లను బాగు చేయాలన్నా రు. ఈ ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పాల్గొని వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..2023 ఎన్నికల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్-బీజాపూర్ హైవే విస్తరణకు అవసరమైన నిధులను మంజూరు చేసినట్లు చెప్పారు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రోడ్డు ను నాలుగులేన్లుగా విస్తరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం వెంటనే స్పం దించి రోడ్డు పనులను ప్రారంభించాలన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అనంతరం తాండూరుకు చెందిన పలువురు ప్రముఖులు మాట్లాడుతూ..రేవంత్ ప్రభు త్వం రోడ్ల మరమ్మతులను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. వెంటనే రోడ్లను బాగు చేయాలని..లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. రోడ్లు బాగుచేయాలని, బాధిత కుటుంబాలకు ఆదుకోవాలని కోరు తూ తాండూరు తహసీల్దార్ తారాసింగ్‌కు వారు వినతి పత్రాన్ని అందజేశారు.