కొడంగల్, జనవరి 25 : సీఎం సోదరుడి భూములకు ధరను పెం చేందుకే కొడంగల్ నియోజకవర్గ కేంద్రాన్ని కాదని, మారుమూల గ్రామమైన లగచర్లకు విద్యాలయాలను రేవంత్‌రెడ్డి తరలిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆరోపించారు. అందుకే ఆయనకు లగచర్లపై అంత ప్రేమ పుట్టిందన్నారు. ఆదివారం మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం బీఆర్ఎస్ నాయకుడు, అడ్వకేట్ మధుసూదన్‌రెడ్డి నివాసంలో పార్టీ శ్రేణులతో జరుగగా.. నరేందర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. గత బీఆర్ఎస్ హయాంలో కొడంగల్, కోస్గి పట్టణాలు మున్సిపల్‌గా రూపుదిద్దుకొని అభివృద్ధిలో పరుగులు పెట్టాయన్నారు. రోడ్డు విస్తరణ, మురు గు కాల్వల నిర్మాణం, 50 పడకల దవాఖాన, పార్కులు వంటి ఎన్నో వసతులు సమకూరినట్లు గుర్తు చేశారు.
అయితే, రేవంత్ సర్కార్ ఏర్ప డి రెండేండ్లు దాటినా మున్సిపల్ పరిధిలో కొత్తగా అభివృద్ధి పనులను చేపట్టలేదని.. పాత వాటినే కూల్చి మళ్లీ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం మున్సిపల్ పరిధిలో గతంలో ఏర్పాటైన అగ్నిమాపక, ఎక్సైజ్ తదితర కార్యాలయాలను లగచర్లకు తరలించి కొడంగల్‌ను శూన్యంగా మార్చుతున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి సీఎం అయితే కొడంగల్ రూపురేఖలు మారుతాయని.. సెగ్మెంట్వాసులు ఓట్లేసి గెలిపించుకున్నారని.. అభివృద్ధి మాట దేవుడెరుగు.. ఉన్న ఉపా ధి, నీడ కూడా లేకుండా చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. లగచర్లలో ఉన్న సీఎం సోదరుడి భూములకు ధరను కల్పించేందుకే కొడంగల్‌కు మంజూరైన మెడికల్, వెటర్నరీ, నర్సింగ్, వ్యవసాయ కళాశాలల నిర్మాణాలను అక్కడే చేపట్టకుండా జీవోను మార్చి లగచర్ల గ్రామానికి తరలిస్తున్నారని నరేందర్‌రెడ్డి ఆరోపించారు. కాం గ్రెస్ హయాంలో కొడంగల్‌కు కీడే తప్ప మేలు ఏ మాత్రం జరగదని తేల్చి చెప్పారు.
వరంగల్‌కు ఓ న్యాయం.. కొడంగల్‌కు మరో న్యాయమా..?
కొడంగల్ మండలంలోని అప్పాయిపల్లిలో మెడికల్, వెటర్నరీ, నర్సింగ్ వంటి కళాశాలల నిర్మాణానికి పేదలను బెదిరించి పచ్చటి పంటలు పండే భూములను ఎకరానికి రూ.10 లక్షల చొప్పున చెల్లించి లాక్కున్నారని.. అదే వరంగల్‌లో విమానాశ్రయ నిర్మాణం కోసం భూ సేకరణలో రైతులకు రూ.2కోట్లు ఇవ్వడంలో అంతర్యమేమిటని, కొ డంగల్ రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. అప్పాయిపల్లి రైతులకు నష్టపరిహారాన్ని సక్రమంగా చెల్లించలేదని.. దీంతో వారు ఉన్న భూములను వదులుకుని.. ప్రభుత్వం నుంచి పరిహారాన్ని పొందలేక రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి, తిరుపతిరెడ్డిల రూల్స్ కొనసాగుతున్నాయని మండిపడ్డారు. రానున్న ప్రభుత్వం మనదేనని.. కొడంగల్ నుంచి తరలించిన ప్రతి సంస్థనూ నియోజకవర్గ కేంద్రంలోనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి..
మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వ మోసం, వైఫల్యాలను ప్రజల్లోకి తీసు కెళ్లాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీని కూడా సక్రమంగా నెరవేర్చలేదని ఆరోపించారు. ఆరు గ్యారెంటీల కార్డును ఇంటింటికీ తిరిగి ప్రజలకు చూపించి ప్రభుత్వం ఎంత బాకీ పడిందో వివరించాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించేలా సన్నద్ధం కావాలన్నారు. వచ్చే బుధవారం మున్సిపల్ పరిధిలో భారీ ర్యాలీ ఉంటుందని పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు మున్సిపల్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సక్సెస్ చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షులు దామోదర్‌రెడ్డి, యాదగిరి, మాజీ ఎంపీపీ దయాకర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు మధుసూదన్రావుయాదవ్, వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ రమేశ్‌బాబు, మాజీ వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ భీములు, కేడీపీ, సీపీఐ నాయకులు సురేశ్‌కుమార్, శ్రీనివాస్, పవన్లాహోటీ, నవాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.