బొంరాస్‌పేట, అక్టోబర్ 7 : రైతులు, ప్రజలను మభ్యపెట్టి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, ప్రజలు ఓట్లేసి గెలిపించి సీఎంను చేస్తే ఇక్క డి రైతుల నోట్లో మట్టికొట్టేలా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం దుద్యాల మండలంలోని గౌరారంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం గత ప్రభుత్వం మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో 14 వేల ఎకరాల భూమిని సేకరించి జీవో కూడా జారీ చేసిందని, భూమి సిద్ధంగా ఉన్నా అక్కడ వాటిని ఏర్పాటు చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి తరలిస్తున్నారని ఆరోపించారు. దుద్యాల మండలంలో రైతులు సాగు చేసుకుంటున్న భూములను ఫార్మా కంపెనీల ఏర్పాటు పేరిట తీసుకునే ప్రయత్నం చేస్తూ ఇప్పటికే 1400 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్‌నూ జారీ చేసిందన్నారు. ఫార్మా కం పెనీల ఏర్పాటును వ్యతిరేకిస్తూ, సీఎం రేవంత్‌రెడ్డి బుద్ధి మారాలని ఈ నెల 9న ఉదయం 7 గంటలకు దుద్యాల మండలంలోని పోలేపల్లి నుంచి దుద్యాల తహసీల్దార్ కార్యాలయం వర కు పాదయాత్ర చేయనున్నట్లు నరేందర్‌రెడ్డి తెలిపారు. అక్కడ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు.
ఆగస్టు 15లోగా రైతులందరికీ ఎలాంటి షరతు ల్లేకుండా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని, వాస్తవంగా ఎక్కడ చూసినా 30 శాతం మందికి కూడా రుణమాఫీ కాలేదని ఆయ న మండిపడ్డారు. కొడంగల్ నియోజకవర్గం లోని రైతులందరి రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫార్మా రద్దు, సంపూర్ణ రుణమాఫీ డిమాండ్లతో చేపట్టే పాదయాత్రలో తనతోపాటు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి పాల్గొననున్నారని, ఫార్మా బాధిత గ్రామాల రైతులు, ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఫార్మా కంపెనీల ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో ఆందోళనల ను ఉధృతం చేస్తామని, కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపడతామని నరేందర్‌రెడ్డి హెచ్చరిం చారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ దుద్యాల, బొంరాస్‌పేట మండలాల అధ్యక్షులు చాంద్‌పాషా, యాదగిరి, దౌల్తాబాద్ మాజీ జడ్పీటీసీ మహిపాల్, మాజీ వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, బీఆర్ఎస్ దుద్యాల మండల యూత్ అధ్యక్షుడు సురేశ్‌రాజ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.