ఇబ్రహీంపట్నం, జనవరి 10 : శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్‌పార్టీ కాలయాపన చేయడానికి ప్రయత్నిస్తున్నదని బీఆర్ఎస్ రంగారెడ్డిజిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలాలు, మున్సిపాలిటీల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులతో ఇబ్రహీంపట్నంలోని పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు దరఖాస్తులు, ఇంటింటి సర్వేల పేరిట కాలం వెళ్లదీయటానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచించారు. ప్రజల్లో కాంగ్రెస్‌పై భ్రమలు తొలిగిపోతున్నాయని, అబద్దాల మీద ఎల్లకాలం గడపడం కాంగ్రెస్‌పార్టీకి సాధ్యం కాదని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్థ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, సీనియర్ నాయకులు తాళ్ల మహేశ్‌గౌడ్, మండలపార్టీ అధ్యక్షులు బుగ్గరాములు, రమేష్‌గౌడ్, రమేష్, దామోదర్, మున్సిపల్ అధ్యక్షుడు జంగయ్య, కిషన్‌గౌడ్, ప్రధాన కార్యదర్శులు వెంకట్‌రెడ్డి, పాశ్చబాష, బహదూర్, పొట్టి శ్రీకాంత్, భాస్కర్‌రెడ్డి, పరుశురాం, నాయకులు జెర్కోని రాజు, నిట్టు జగదీశ్వర్, బాలకృష్ణగౌడ్ తదితరులున్నారు.