కడ్తాల్(మాడ్గుల), డిసెంబర్ 4 : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీల అమలుపై నిలదీయాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం మాడ్గుల మండలంలోని ఆర్కపల్లి గ్రామానికి చెం దిన కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఉప సర్పంచ్ బిక్కుగౌడ్తోపాటు శిరీష, జంగయ్యగౌడ్, జగదీశ్వర్‌గౌడ్, సురేశ్, శ్రీనివాస్, నాగరాజు, ఉస్మాన్, నగేశ్‌తోపాటు మరో 20 మంది కాంగ్రెస్ నాయకులు కడ్తాల్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
అనంతరం ఆర్కపల్లి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా శిరీషాబిక్కుగౌడ్ను జైపాల్‌యాదవ్ ప్రకటించి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు సత్తా చాటాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీయాలన్నారు. గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఏకతాటిపై ఉండి సర్పంచ్, వార్డు సభ్యులను గెలిపించుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జైపాల్‌నాయక్, పీఏసీఎస్ డైరెక్టర్ రాజ్యవర్ధన్రెడ్డి, కడ్తాల్ మాజీ జడ్పీటీసీ దశరథ్‌నాయక్, మాజీ సర్పంచ్‌లు వాసీరాంనాయక్, జంగయ్య, బీఆర్ఎస్ ఆర్కపల్లి గ్రామాధ్యక్షుడు జమీల్, ఉద్యమకారుడు చెన్నకేశవులు, నాయకులు నీలయ్య, గౌస్, శివ తదితరులు పాల్గొన్నారు.