షాద్‌నగర్‌టౌన్, నవంబర్06 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ రహమత్‌నగర్‌లో గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందన్నారు. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు చేసింది ఏమి లేదని, కాంగ్రెస్ నమ్మె పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు.
ఎన్నికల సమయంలో హామీలను అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇంటింటి ప్రచారంలో ఎక్కడి వెళ్లినా మా ఓటు కారుగుర్తుకే అని ప్రజలు స్వచ్ఛందంగా చెబుతున్నారని, ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అఖండ విజయాన్ని సాధిస్తుందన్నారు. అదే విధంగా బీఆర్ఎస్ యువ నాయకుడు వై. రవీందర్‌యాదవ్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించి కారుగుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కొందూటి నరేందర్, నాయకులు కడెంపల్లి శ్రీనివాస్, వీరేశం, పాపయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.