బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా..
బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ఎంపీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు దూసుకెళ్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో ఆరు మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు.
- షాద్‌నగర్‌లో ప్రచారం చేసిన మాజీ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్
- ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ ఎన్నికల ఇన్చార్జి దూదిమెట్ల బాల్‌రాజ్‌యాదవ్
- వివిధ మండలాల్లో శ్రేణుల ప్రచారం
షాద్‌నగర్, మే2: బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ఎంపీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు దూసుకెళ్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో ఆరు మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. గురువారం షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 2, 3, 14, 16, 21 వార్డుల్లో కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు.
చటాన్‌పల్లి, రాంనగర్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్, ఎంపీ ఎన్నికల ఇన్చార్జి దూదిమెట్ల బాల్‌రాజ్‌యాదవ్, కౌన్సిలర్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, కౌన్సిలర్లు శ్రీనివాస్‌గౌడ్, వెంకట్రాంరెడ్డి, శ్రీనివాసులు, నాయకులు నారాయణరెడ్డి, రాంబాల్‌నాయక్, రాజ్యలక్ష్మి, యుగేందర్, రవియాదవ్, శేఖర్, శ్రీశైలం, పాండురంగారెడ్డి, శంకర్, కిషోర్, నర్సింహ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొందుర్గులో..మండలంలోని పర్వాతాపూర్, పులుసుమామిడి,
మహదేవ్పూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రాజేశ్‌పటేల్, నాయకులు రామకృష్ణల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు శ్రీకాంత్‌గౌడ్, యాదయ్య, అబ్దుల్‌కలాం, విజేందర్‌రెడ్డి, మానయ్య, రామచంద్రయ్య, రెడ్డి నర్సింహులు, రాజరామేశ్వర్రెడ్డి, నజీర్, యాదయ్య, శేఖర్‌గౌడ్, సంజీవ, గణేశ్, గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

