యాచారం, జూలై19 : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కన్నా నాయక్ సూచించారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మండలంలోని నంది వనపర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అటవీశాఖ ఆధ్వర్యంలో శనివారం మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పచ్చదనం పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ విస్తారంగా మొక్కలు నాటాలని ఆయన సూచించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించి వృక్షాలుగా మలిచేందుకు కృషి చేయాలని కోరారు. అడవుల సంరక్షణకు ప్రజలు అన్ని విధాలుగా సహకరించాలని ఆయన కోరారు. మొక్కల సంరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని ఆయన గుర్తు చేశారు. అడవులలో చెట్లను నరకడం నేరమని ఆయన పేర్కొన్నారు. ఎక్కడైనా చెట్లను నరికితే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో అటవీశాఖ సెక్షన్ అధికారి నరసింహ నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ శాస్త్రి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, అటవీ శాఖ బీట్ అధికారి జంగారావు, అటవీ శాఖ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.