కందుకూరు, అక్టోబర్ 9 : మత్యృకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయాలని ఆ సంఘం నాయకులు కోరారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని కొత్తగూడ గ్రామంలో సున్నం చెరువు పూర్తిగా నీటితో నిండడంతో కట్ట మైసమ్మ వద్ద చెరువులో పూజలను నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా తమకు చేప పిల్లలను పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని పేర్కొన్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు.
ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయాలని కోరారు. కార్యక్రమంలో ముదిరాజ్ మత్యృకార సంఘం సొసైటీ అద్యక్షులు తాళ్ల నర్సింహ ముదిరాజ్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పిట్టల యాదయ్య ముదిరాజ్, డైరెక్టర్లు తాళ్ల బాలేశ్ ముదిరాజ్, చీమల శేఖర్ ముదిరాజ్, మేరుగు క్రిష్ణ ముదిరాజ్, సత్తయ్య ముదిరాజ్, శ్రీశైలం ముదిరాజ్, శేఖర్ ముదిరాజ్, తాళ్ల మల్లేశ్ ముదిరాజ్, కిరణ్ ముదిరాజ్, శ్రీకాంత్ ముదిరాజ్, అంజన్ ముదిరాజ్, వెంకటేశ్ ముదిరాజ్లు పాల్గొన్నారు.