షాబాద్, సెప్టెంబర్ 3: జీవాల ఆరోగ్యం పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని రేగడిదోస్వాడ పశువైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని తిమ్మారెడ్డిగూడ గ్రామంలో జీవాలకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పాడి పరిశ్రమను పోషించుకుని జీవనం సాగించే రైతులకు మంచి ఆదాయం ఉంటుందని చెప్పారు.
గొర్రెలు, మేకల పెంపకంపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. పశుసంవర్దకశాఖ ఆధ్వర్యంలో జీవాలకు, పశువులకు ఉచితంగా వ్యాధి నిరోధక టీకాలు వేస్తారని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యసిబ్బంది కృష్ణమూర్తి, శ్రీను, బాలరాజ్, సుధాకర్, రైతులు తదితరులున్నారు.